టాలీవుడ్ లో తల్లి పాత్రలకే పరిమితమైన శ్రియ  

మరోసారి తల్లి పాత్రలో కనిపించనున్న శ్రియా శరణ్. .

Shriya Saran Play A Mother Role In Chandra Sekhar Yeleti Movie-

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిన నటి శ్రియ.కెరీర్లో స్టార్ హీరోలతో జతకట్టిన ఈ భామ తెలుగు తమిళ హిందీ భాషల్లో ఏకంగా దశాబ్దకాలం పాటు తన హవా కొనసాగించింది.ఇక ఈ మధ్య కాలంలో టెన్నిస్ ప్లేయర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన శ్రియ శరన్ సినిమాలు కూడా బాగా తగ్గించేసింది..

Shriya Saran Play A Mother Role In Chandra Sekhar Yeleti Movie--Shriya Saran Play A Mother Role In Chandra Sekhar Yeleti Movie-

అయితే అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో ఈ భామ సందడి చేస్తుంది.ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో పూర్తిగా సీనియర్ హీరోలుకి జోడీగా మారిపోయి ఏకంగా తల్లి పాత్రలకే పరిమితమైపోయింది.ఇప్పటికే శ్రియ శరన్ కి టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్న కూడా చాలా వరకు అవి తల్లి పాత్రలే.

శ్రియ తో పాటు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా నయనతార ఇప్పటికీ తమిళం లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.ప్రస్తుతం కోలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయన్ కొనసాగుతుంది.అయితే శ్రియ మాత్రం ఇప్పుడు ఏకంగా తల్లి పాత్రలకి పరిమితం అయిపోవడం గమనార్హం.

తాజాగా టాలీవుడ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో శ్రియ శరన్ అవకాశం సొంతం చేసుకుంది.నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రియ ఓ పదేళ్ల పాపకి తల్లిగా నటిస్తుందని తెలుస్తోంది.విలక్షణ దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమా కావడంతో నటిగా తనకు మంచి గుర్తింపు తీసుకు వస్తుందని శ్రియ ఈ పాత్రకి ఓకే చెప్పినట్లు సమాచారం.

మరి చాలా గ్యాప్ తర్వాత శ్రియ టాలీవుడ్ తెరపై కనిపిస్తున్న ఈ సినిమా ఆమెకి ఏ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుంది అనేది చూడాలి.