ఆర్ఆర్ఆర్ లో నేను చేస్తుంది చాలా చిన్న పాత్ర అంటున్న శ్రియ

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నభారీ బడ్జెట్ చిత్రంఆర్ఆర్ఆర్.భారీ మల్టీ స్టారర్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది.

 Shriya Saran Open Up Her Role In Rrr, Tollywood, Bollywood, Jr Ntr, Ram Charan,-TeluguStop.com

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలలో కనిపిస్తున్నారు.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

హాలీవుడ్ నటులతో పాటు, బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా భట్ కీలక పాత్రలు చేస్తున్నారు.ఈ సినిమా మీద దేశ వ్యాప్తంగా భారీ హైప్ ఉంది.

బాహుబలికి మించిన హిట్ ఈ సినిమాతో కొట్టాలని రాజమౌళి గట్టి ప్లాన్ చేస్తున్నారు.అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో బడ్జెట్ మరింత పెరిగిపోతూ ఉందని నిర్మాత డివివి దానయ్య కొంత టెన్షన్ పడుతున్నాడు.

ఈ నేపధ్యంలో త్వరలో షూటింగ్ ప్రారంభించడానికి జక్కన్న రెడీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో శ్రియ కీలక పాత్రలో నటిస్తుంది.

తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ లో తన పాత్ర గురించి కొంత క్లారిటీ ఇచ్చింది.ఈ చిత్రంలో తన పాత్ర చిన్నదేనని ఆమె తెలిపింది.

ఛత్రపతి తర్వాత రాజమౌళితో మళ్లీ పని చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని శ్రియ తెలిపింది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తో కలిసి పని చేస్తున్నానని, ఆయన ఒక గొప్ప నటుడని కితాబిచ్చింది.

అజయ్ ఎంతో మర్యాదపూర్వకమైన మనిషి అని చెప్పింది.అయితే, తారక్, చరణ్ లతో కలిసి తనకు ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం బాధగా ఉందని తెలిపింది.

వారి పాత్రలు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube