కథ నచ్చితే కొత్త హీరోలైనా ఓకే అంటున్న సీనియర్ హీరోయిన్  

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి శ్రియ శరన్.కెరియర్ ఆరంభంలోనే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్స్ తో ఆడిపాడిన ఈ అమ్మడు సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు అందరితో జత కట్టింది.

TeluguStop.com - Shriya Saran Open Offer To New Talented Directors

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ అమ్మడు ఇప్పటికి వన్నె తగ్గని అందంతో అలాగే నటిగా తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకి వెళ్తుంది.ఆమెలోని నటి గురించి చెప్పాలంటే మనం సినిమా చూడాల్సిందే.

అలాగే తనలోని అసలు, సిసలైన నటిని ఆమె చాలా సందర్భాలలో బయటకి తీసింది.అందుకే ఇప్పటికి శ్రియ కోసం కొంత మంది దర్శకులు ప్రత్యేకంగా పాత్రలని సృష్టిస్తున్నారు.

TeluguStop.com - కథ నచ్చితే కొత్త హీరోలైనా ఓకే అంటున్న సీనియర్ హీరోయిన్-General-Telugu-Telugu Tollywood Photo Image

పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అయిన ఈ అమ్మడు సినిమాల కోసం ఇక్కడికి వచ్చి పోతూ ఉంది.ప్రస్తుతం గమనం అనే సినిమాలో శ్రియ శరన్ నటిస్తుంది.

ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది.సినిమాలో ఆమె చేస్తున్న పాత్ర కచ్చితంగా ఆమె కెరియర్ లో గుర్తిండిపోయేది అవుతుందని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది.చెవుడు, నత్థితో తనని వదిలేసి పోయిన భర్త వస్తాడని ఎదురుచూస్తూ కొడుకు కోసం జీవించే ఇల్లాలి పాత్రలో ఆమె చాలా అద్భుతంగా నటించింది అని చెప్పాలి.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియ తన సినిమా సెలక్షన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.

కథ బాగుండి, అందులో తన పాత్ర నచ్చితే ఖచ్చితంగా కొత్తవాళ్లతో నటించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ తగ్గించుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది.మరి శ్రియ ఇచ్చిన ఈ ఆఫర్ ని టాలీవుడ్ కొత్త వాళ్ళతో సినిమాలు తీసే దర్శకులు ఎంత వరకు ఉపయోగించుకుంటారు అనేది చూడాలి.

.

#Shriya Saran #South Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shriya Saran Open Offer To New Talented Directors Related Telugu News,Photos/Pics,Images..