బంగార్రాజులో శ్రీయ శరణ్ లక్కీ ఛాన్స్..!

కింగ్ నాగార్జున కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో సోగ్గాడే చిన్ని నాయనా ప్రీ క్వల్ గా వస్తున్న సినిమా బంగార్రాజు.ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తున్నారు.

 Shriya Saran Lucky Chance Nagarjuna Bangarraju, Annapurna Studios, Bangarraju, K-TeluguStop.com

ఇక ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా నటిస్తాడని తెలుస్తుంది.చైతు సరసన ఉప్పెన భామ కృతి శెట్టిని హీరోయి గా ఫిక్స్ చేసినట్టు టాక్.

కృతి శెట్టికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఈ సినిమాలో తీసుకున్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా ముందు రమ్యకృష్ణని అనుకున్నా ఇప్పుడు ఆ స్థానంలో శ్రీయ శరణ్ వచ్చి చేరింది.

పెళ్లైనా సరే వరుస సినిమాలతో దూసుకెళ్తుంది శ్రీయ శరణ్.ఈ క్రమంలో నాగార్జున బంగార్రాజు సినిమాలో కూడా ఆమె లక్కీ ఛాన్స్ అందుకుందట.నాగ్ తో శ్రీయ ఇంతకుముందు జోడీ కట్టిన సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి ఆ సెంటిమెంట్ తో కూడా బంగార్రాజు కోసం ఆమెను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.శ్రీయ శరణ్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినీ కెరియర్ కొనసాగిస్తున్న వారిలో శ్రీయ సీనియర్ అని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube