శ్రియా శరన్.తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు వెలుగు వెలిన నటి.
సుమారు దశాబ్దం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది.అందరు అగ్ర నటులతో ఈమె సూపర్ హిట్ సినిమాలు చేసింది.
మొత్తంగా తన 20 ఏండ్ల సినీ కెరీర్ లో ఎవర్ గ్రీన్ నటిగా ముందుకుసాగుతుంది.అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తుంది.
అందులో భాగంగానే గమనంతో పాటు ఆర్ ఆర్ ఆర్ సినిమాల్లో నటిస్తుంది.తన రోల్ చిన్నదే అయినా.
నటనకు మంచి స్కోప్ ఉంది.
ఈ రెండు సినిమాలు త్వరలోనే జనాల ముందు రాబోతున్నాయి.
గమనం సినిమా ఇవాళ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.అటు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా జనవరి 7న జనాలను పలుకరించబోతుంది.
అయితే కొంత కాలం క్రితం పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తల్లి అయ్యింది.అయితే ఈ రెండు చిత్రాల్లోనూ తను తల్లిగానే నటించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
వాస్తవానికి శ్రియ శరన్ ఇప్పటికే చాలా సార్లు తల్లి క్యారెక్టర్ చేసింది.ఇదే తొలిసారి కాదు.అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించి మనం సినిమాతో పాటు వెంకటేష్, పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాల, హిందీలో తెరకెక్కిన దృశ్యం, బాలయ్య హీరోగా చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ సినిమాల్లో నటించింది.వాస్తవం ఏంటంటే ఈ నాలుగు సినిమాల్లో శ్రియ మంచి నటన కనబర్చింది.
అమ్మగా అద్భుతంగా ఒదిగిపోయింది.ప్రస్తుతం గమనం, త్రిఫుల్ ఆర్ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది.
నాలుగు సినిమాల్లో అమ్మగా నటించి మెప్పించిన ఈ నాజూకు సుందరి.ఈ రెండు సినిమాల్లో ఎలా ఆకట్టుకుంటుందోనని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ రెండు సినిమాలు విజయాన్ని అందుకుంటే శ్రియ ఖాతాలో తల్లిగా ఆరు సినిమాలు జమ అవుతాయి.గమనం ఏమో గానీ, త్రిఫుల్ ఆర్ తిరుగులేని విజయాన్ని అందుకుంటుంది అంటున్నారు సినీ జనాలు.