టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాల కెరియర్ లోకి అడుగుపెట్టబోతున్న అందాల భామ శ్రియా శరన్. 2001లో ఇష్టం సినిమాతో కెరియర్ ప్రారంభించిన ఈ భామ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలతో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయింది.
ఏకంగా స్టార్ హీరోలు అందరితో కూడా శ్రియా జతకట్టింది.తెలుగులో స్టార్ హీరోలతో జత కట్టిన అతికొద్ది మంది అందాల భామలలో శ్రియా కూడా ఒకరుగా నిలిచింది.
విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఇప్పటికి నటిగా కెరియర్ కొనసాగిస్తుంది.మంచి మంచి అవకాశాలు సొంతం చేసుకుంటుంది.
సీనియర్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా శ్రియా శరన్ ఉంటుంది.ఆమె చివరిగా రెండేళ్ళ క్రితం గాయత్రి సినిమాలో మంచు విష్ణుకి జోడీగా నటించింది.
ప్రస్తుతం రెగ్యులర్ సినిమాల జోలికి వెళ్ళకుండా కొత్తదనం ఉన్న కథలతో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్న శ్రియా ఇప్పుడు మరో విభిన్న కథాంశంతో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న లేడీ ఒరియాంటెడ్ సినిమా గమనంలో నటిస్తుంది.సౌత్ ఇండియా బాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఒక సాధారణ గృహిణి జీవితంలో భావోద్వేగాల మిలితంగా గమనం సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.తాజాగా శ్రియా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇక ఈ సినిమాకి సుజనారావ్ దర్శకత్వం వహిస్తుంది.ఇక ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాకి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.మరి పాన్ ఇండియా రేంజ్ లో ఫిమేల్ సెంట్రిక్ గా తెరకెక్కుతున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎంత వరకు శ్రియాకి సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.