టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఏకంగా 15 ఏళ్ల పాటు తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన అందాల భామ శ్రియ శరన్.కెరియర్ ఆరంభంలోనే చిరంజీవి.
బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి స్టార్స్ తో నటించిన ఈ అమ్మడు అప్పుడే ట్రాక్ లోకి వచ్చి స్టార్ హీరోలుగా ఎదుగుతున్న ప్రభాస్, రవితేజ, ఇళయదళపతి విజయ్ లాంటి వారితో ఆదిపాడింది.శ్రియ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు పూర్తయ్యింది.
ఇక శ్రియ చివరిగా తెలుగులో పైసా వసూల్ సినిమాలో బాలకృష్ణకి హీరోయిన్ గా నటించింది.ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకొని మళ్ళీ బిజీ అయ్యింది.
ఇప్పటికి నటిగా తన ప్రయాణం కొనసాగిస్తుంది.ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవగన్ కి జోడీగా నటిస్తుంది.
అలాగే గమనం అనే పాన్ ఇండియా మూవీలో ఇద్దరు పిల్లల తల్లిగా మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది.

ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది.అలాగే తమిళ్ లో నరగాసురన్ అనే మూవీ కూడా రిలీజ్ కోసం వెయిటింగ్ లో ఉంది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ స్పెయిన్ వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడే బార్సిలోనాలో సెటిల్ అయ్యింది.
అక్కడ ఓ హోటల్ వ్యాపారం కూడా స్టార్ట్ చేసింది.అయితే కరోనా కారణంగా ఈ సీనియర్ బ్యూటీ స్పెయిన్ లోనే ఉండిపోయింది.
ఏడాది తర్వాత మరల ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టింది.ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా స్టొరీలో షేర్ చేసుకుంది.
ఏడాది తర్వాత ఇండియాలో అడుగుపెడుతున్నా అని పోస్ట్ పెట్టింది.ఇండియాలోనే ఉండి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బ్యూటీ అత్తారింటికి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.