నితిన్ సినిమాకి ఇంకా ఓకే చెప్పలేదు అంటున్న శ్రియ  

Shriya Gives Clarity on Andhadhun Telugu Remake, Hero Nithiin, Merlapaka Gandhi, Andhadhun Remake, Tollywood, Shriya Saran - Telugu Andhadhun Remake, Hero Nithiin, Merlapaka Gandhi, Shriya Gives Clarity On Andhadhun Telugu Remake, Shriya Saran, Tollywood

టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించి త్వరలో 20 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న అందాల భామ శ్రియ శరన్.కెరియర్ ఆరంభం నుంచి వరుస సినిమాలు చేస్తూ స్టార్ట్ హీరోలతో జత కడుతున్న ఈ అందాల భామ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ వచ్చింది.

TeluguStop.com - Shriya Gives Clarity On Andhadhun Telugu Remake

సౌత్ లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గ స్టార్ హీరోలు అందరితో ఈ అమ్మడు నటించేసింది.ఇక సౌత్ లో సినిమాలు తగ్గే సమయంలో హిందీలో సినిమాలు చేస్తూ నటిగా ఫుల్ బిజీ షెడ్యూల్ ని కొనసాగించింది.

ఇప్పటికి ఈ భామకి సౌత్ లో మంచి డిమాండ్ ఉంది.అయితే ఒకప్పటిలా హీరోయిన్ రేంజ్ కాకపోయిన కీలక పాత్రల కోసం, శ్రియని తీసుకుంటున్నారు.

TeluguStop.com - నితిన్ సినిమాకి ఇంకా ఓకే చెప్పలేదు అంటున్న శ్రియ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఈ భామ ఫిమేల్ సెంట్రిక్ కథతో గమనం అనే పాన్ ఇండియా మూవీ ఒకటి చేస్తూ ఉండగా, మరో వైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ కి జోడీగా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ అమ్మడు మళ్ళీ సౌత్ లో బిజీ అవ్వడానికి సినిమాలు ఒప్పుకుంటుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం తన సినిమాల గురించి చెప్పుకొచ్చింది.

ఇందులో భాగంగా నితిన్ హీరోగా తెలుగులోకి రీమేక్ అవుతున్న అందాధున్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగులో తెరకెక్కబోతుంది.ఇక హిందీ వెర్షన్లో టబు ఓ కీలక పాత్ర పోషించింది.తెలుగు రీమేక్ లో ఈ పాత్రకు కోసం చాలా మంది నటీమణులని సంప్రదిస్తున్నారు.ఈ క్రమంలో ప్రముఖ నటి శ్రియ ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, ఆమె ఎంపిక ఖరారైందనీ ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే, ఈ చిత్రానికి తాను ఓకే చెప్పినట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని శ్రియ తాజాగా పేర్కొంది.ఈ చిత్రం యూనిట్ నన్ను అడిగిన మాట, నన్ను సంప్రదించిన మాట వాస్తవమే అయిన ఇంకా ఫైనల్ కాలేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని చెప్పింది.అయితే ఇంత మంచి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అంటే ఎవరైనా కచ్చితంగా ఒకే చెప్పేస్తారు.

అయితే శ్రియ ఇంకా చర్చల దశలోనే ఉందని చెబుతుంది అంటే రెమ్యునరేషన్ విషయంలో ఇంకా శ్రియ, నిర్మాతలకి అండర్ స్టాండింగ్ కుదరలేదనే మాట వినిపిస్తుంది.

#Shriya Saran #Hero Nithiin #ShriyaGives

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shriya Gives Clarity On Andhadhun Telugu Remake Related Telugu News,Photos/Pics,Images..