పెళ్ళిలో శ్రియ భూపాల్ ధరించిన ఆ నెక్లెస్ ధర ఎంతో తెలుసా.? చూస్తే షాక్ అవుతారు.!       2018-07-08   23:46:34  IST  Raghu V

సెంబర్ 9 2016 పాపం అక్కినేని నాగార్జున తన చిన్న కొడుకు వద్దు వద్దంటున్నా 22ఏళ్లకే పెళ్లి చేసుకుంటా..అంటే కాస్త షాక్ తిన్నా కూడా తమాయించుకుని సరే మనొడు పెద్దింటి పిల్లనే కదా పెళ్లాడతానంటొంది అనుకుని…సర్దుకుని ఎంగేజ్‌మెంట్ చేశాడు. ఆ తర్వాత ఎయిర్‌‌పొర్టులొ అఖిల్, శ్రీయాభూపాల్ ఇద్దరూ గొడవ పడ్డారని అన్నారు..ఎంగేజ్ మెంట్ కాదు..పెళ్లే క్యాన్సిల్ చేశారు అని చెప్పారు..ఐతే ఈ రెండు కుటుంబాల్లొ పాపం ఎవరూ గొంతు విప్పలేదు.

తాజాగా శ్రియ భూపాల్ మరోసారి తెరపైకి వచ్చారు. ఇటీవలే ఆమె పెళ్లి జరిగింది. అపోలో ఛైర్మ‌న్ ప్ర‌తాప్‌ సి.రెడ్డి మ‌న‌వ‌డు అనిందిత్ రెడ్డి తో ఆమె వివాహం జరిగింది. వివాహంలో శ్రియా ధ‌రించిన వ‌జ్రాల హారం వివాహానికి హాజరైన సెలబ్రిటీల్లో చర్చకు దారితీసింది. స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రియా, మెడలో డైమండ్ నెక్లెస్‌ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, సంప్రదాయ దుస్తులతో అనిందిత్ ఆకట్టుకుంటున్నాడు. నెక్లెస్‌తోపాటు శ్రియా ధరించిన పాపిడిబిళ్ల‌, వ‌డ్డానం ఇలా అన్నింటినీ ఖ‌రీదైన వజ్ర‌వైఢూర్యాల‌తో రూపొందించ‌డం విశేషం. వీటి ఖ‌రీదు ఎంత కాదన్నా దాదాపు 5 కోట్ల వరకు ఉండొచ్చని అంచానా వేస్తున్నారు.

వివాహం శుక్రవారం (జులై 6) హైద‌రాబాద్‌ స‌ద్గురు సంస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది. అతిధుల‌కు న‌గ‌రంలోని ఖ‌రీదైన తాజ్ కృష్ణ‌లో బ‌స‌ను ఏర్పాటు చేశారు.ఈ పెళ్ళిలో రామ్ చరణ్ ఉపాసనల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.