సిరిని అర్థం చేసుకోవాలంటే చాలా సమయం కావాలి: శ్రీహాన్

బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక్కొక్క కాంటెస్టెంట్ లైఫ్ ఒక్కో విధంగా ఉంటుంది.కొందరి బిగ్ బాస్ హౌస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సినిమా అవకాశాలతో దూసుకుపోతుంటారు.

 Srihan Emotional Words About Siri Hanmanth Details, Siri Hanmanth, Shrihan, Big-TeluguStop.com

ఇంకొందరు బిగ్ బాస్ హౌస్ ద్వారా బోలెడంత నెగిటివిటీని మూటగట్టుకుంటారు.ఇప్పటికే ఎంతోమంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ ద్వారా బోల్డంత నెగిటివిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

అలాంటి వారిలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి హనుమంతు కూడా ఒకరు.బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో, అలాగే యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లో,షార్ట్ ఫిలిం లలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

కానీ బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ యశ్వంత్ తో క్లోజ్ గా ఉండడంతో పాటు ఆమె చేసిన పనులకు బోలెడంత నెగిటివిటీ ఏర్పడింది.అయితే బయట ఆమె ప్రియుడు శ్రీహాన్ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మరిచి ఆమె షణ్ముఖ్ జస్వంత్ తో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునైనా ఏకంగా బ్రేకప్ చేసిన విషయం తెలిసిందే.సిరి, శ్రీహాన్ కూడా అంటూ వార్తలు వినిపించాయి.

కానీ సిరి, శ్రీహాన్ లు కలిసి పార్టీలకు హాజరవుతూ అటువంటి వార్తలకు చెక్‌ పెట్టేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీహాన్‌ తన ప్రేయసిపై పొగడ్తలు కురిపించాడు.

తాజాగా యాంకర్ రవి బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్లతో ఓ సరదా ఇంటర్వ్యూ చేశాడు.దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్‌ చేయగా అందులో శ్రీహాన్‌ ఓ వీడియోలో పంపుతూ సిరి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు.సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది.నాకిప్పటికీ పడుతూనే ఉంది.సిరి ఏదైనా సాధించాలనుకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా దేన్నీ పట్టించుకోదు.తను వైజాగ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌ వచ్చి కొన్ని సాధించాలనుకుంది.

యాంకరింగ్‌ చేసుకుంటూ సీరియల్స్‌, సీరియల్స్‌ నుంచి సినిమాలు, సినిమాల నుంచి మొన్నటి బిగ్‌బాస్‌ వరకు.మొత్తం తన కష్టమే.

ఎవ్వరూ సాయం చేసింది లేదు.ఎవరి సపోర్ట్‌ తను తీసుకుందీ లేదు.

కానీ ఎంత మాట్లాడినా సిరిని అర్థం చేసుకోవడం మాత్రం కష్టం అంటూ సిరి ని పొగడ్తలతో ముంచెత్తాడు శ్రీహాన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube