నా మిత్రులే నాకు వెన్నుపోటు పొడిచారంటున్నా హీరో.. ఎవరంటే?

వెన్నుపోటు పొడవడానికి శత్రువులే అవసరం లేదు.స్నేహితులు కూడా వెన్నుపోటు పొడుస్తారు.

 Shreyas Talpade Says His Bollywood Frnds Backstabbed-TeluguStop.com

దీనికి చక్కని నిదర్శనం బాలీవుడ్ హీరో శ్రేయస్.హిందీతో పాటు మరాఠీ లో కూడా నటించాడు.2005 లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రేయస్ ఇక్బాల్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.ఆ తర్వాత ఓం శాంతి ఓం, గోల్మాల్ రిటర్న్స్, హౌస్ ఫుల్ 2 వంటి సినిమాల్లో నటించి మంచి సక్సెస్ను అందుకున్నాడు.

మరాఠీ లో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు.అంతేకాకుండా పలు సినిమాలకు దర్శకత్వం, నిర్మాతగా కూడా చేశాడు.టెలివిజన్ లో కూడా నటించాడు శ్రేయస్.

 Shreyas Talpade Says His Bollywood Frnds Backstabbed-నా మిత్రులే నాకు వెన్నుపోటు పొడిచారంటున్నా హీరో.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయస్కొ న్ని విషయాలు పంచుకున్నాడు.

ఒకప్పుడు తనతో కలిసి సినిమాలు చేసిన మిత్రులే ఇప్పుడు తనను వద్దాంటున్నారని తెలిపారు. తాను నటించిన కొన్ని సినిమాలు అనుకున్నంత విజయాన్ని అందుకోలేనందున తనని వద్దన్నారని తెలిపాడు.

నిజానికి తాను బాలీవుడ్ లో కొన్ని సినిమాలను తన స్నేహితుల కోసం చేసానని తెలిపాడు.కానీ ఇప్పుడు తనని సినిమాలకు దూరం పెడుతున్నారని బాధను వ్యక్తం చేస్తున్నాడు.

తను సినిమాలలో నటిస్తే వారు అభద్రతకు గురవుతున్నారని తెలిపారు.నిజానికి తనతో నటించడానికి వెనుకాడుతున్నారని తెలిపాడు.బాలీవుడ్ లో 90% పరిచయాలేనని కేవలం కొద్దిమంది మాత్రమే స్నేహితులుగా ఉంటారని తెలిపారు.ఇక గతంలో తనతో కలిసి చేసిన స్నేహితులు ఇప్పుడు కలుపుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తాను లేకుండానే ఇప్పుడు వాళ్ళ సినిమాలు చేస్తున్నారని తెలిపారు.

అలాంటి వాళ్ళు స్నేహితులు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నాడు.తన మిత్రులే ఇప్పుడు తనకు వెన్నుపోటు పొడిచారు అన్నాడు.ఇక ఈయన చివరిసారిగా బాలీవుడ్ లో నటించిన సినిమా సెట్టర్స్ ఈ సినిమా 2019 లో విడుదలైంది.

#Housefull 2 #Shreyas Talpade #Om Shanti Om

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు