Shreeram Nimmala Madhi Movie Review: మది రివ్యూ: ఫీల్ గుడ్ స్టోరీతో ప్రేక్షకులను కనెక్ట్ చేసుకున్న మది!

డైరెక్టర్ నాగ ధనుష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా మది. ఇక ఈ సినిమాలో శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి, స్నేహ మాధురి శర్మ, శ్రీకాంత్, యోగి తదితరులు నటించారు.

 Shreeram Nimmala Richa Joshi Madhi Movie Review And Rating Details, Madhi Movie-TeluguStop.com

ఇక ఈ సినిమాకు రామ్ కిషన్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.పీవీఆర్ రాజా స్వరకర్త మ్యూజిక్ అందించాడు.

చిన్న సినిమా అయినప్పటికీ కూడా మంచి కంటెంట్ ఉంటే చూడకుండా ఉండలేం అన్నట్లుగా ప్రేక్షకులు ఇటువంటి సినిమా కోసం బాగా ఎదురుచూస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.ఇక హీరో హీరోయిన్ కి ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ:

సినిమా కథ ఏంటంటే.శ్రీరామ్ నిమ్మల అభిమన్యు పాత్రలో నటించాడు.రిచా జోషి మధు అనే పాత్రలో నటించింది.అయితే అభిమన్యు, మధు ఇద్దరు ఎదురెదురు ఇళ్లలో ఉంటారు.ఇక వీరిద్దరి వయసులోకి రాగానే ప్రేమలో పడతారు.

అయితే వీరి ప్రేమ ఎటువంటి అడ్డంకులు లేక సాఫీగా సాగుతున్న సమయంలో వీరి పెళ్లికి విరి పెద్దలు నిరాకరిస్తారు.కారణం ఏంటంటే కులం.

దీంతో మధుని తన తండ్రి తమ కులం లోకి చెందిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తాడు.ఇక మధు పెళ్లయిన కూడా అభి ని మర్చిపోకుండా తన ప్రేమను అతనితో అలాగే కొనసాగిస్తుంది.

ఇక చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

Telugu Naga Dhanush, Story, Richa Joshi, Madhi, Madhi Review, Madhi Story, Shree

నటినటుల నటన:

హీరో శ్రీరామ్ నిమ్మల తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు.ఒక బాయ్ ఫ్రెండ్ పాత్రలో ఎలా ఉండాలో అలా చూపించాడు.అంతేకాకుండా భగ్న ప్రేమికుడిగా కూడా బాగా నటించి చూపించాడు.

హీరోయిన్ రిచా కూడా అద్భుతంగా నటించింది.మిగతా నటీనటులంతా పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా ఈ సినిమా.డైరెక్టర్ ఈ సినిమా కథను అద్భుతంగా చూపించాడు.

పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నాడు.ఇక సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఆకట్టుకుంది.మిగతా టెక్నికల్ విభాగాలు బాగానే పనిచేశాయి.

Telugu Naga Dhanush, Story, Richa Joshi, Madhi, Madhi Review, Madhi Story, Shree

విశ్లేషణ:

ఇక ఈ సినిమా ఫస్టాఫ్ మొత్తం లవ్ స్టోరీ తో కొనసాగుతూ ఉంటుంది.సెకండాఫ్ లో కథలో కాస్త ట్విస్ట్ కనిపిస్తుంది.అంతేకాకుండా రొటీన్ గా అనిపించినా కూడా కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది.నిజానికి ఈ సినిమా చూసినంత సేపు నేటి యువతరం బాగా కనెక్ట్ అయి ఉంటారు.అచ్చం తమ స్టోరీ లాగే ఉందని ఫీల్ అవుతూ ఉంటారు.ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా కనెక్ట్ చేస్తుంది.

ప్లస్ పాయింట్స్:

సినిమా స్టోరీ, నటీనటుల నటన, ఎమోషనల్ సన్నివేశాలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్.

Telugu Naga Dhanush, Story, Richa Joshi, Madhi, Madhi Review, Madhi Story, Shree

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయి.సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ రియల్ టైం స్టోరీ అని చెప్పవచ్చు.ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

రేటింగ్: 2/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube