ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్న పాప ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.?

తెలుగులో లో సందడే సందడి అనే చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ శ్రావ్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు గోవర్ధన రెడ్డి దర్శకత్వం వహించిన టువంటి “లవ్ యూ బంగారం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు 2004వ సంవత్సరంలో హీరోయిన్ గా పరిచయమైంది.

 Shravya, Telugu Heroine, Tollywood, Love You Bangaram, Childhood Photos-TeluguStop.com

ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఎందుకో కొత్త సినిమా అవకాశాలను దక్కించుకోలేక పోయింది.

దీంతో అడపాదడపా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని  అలరిస్తోంది.

అయితే తెలుగులో చివరిగా శ్రావ్య నందిని నర్సింగ్ హోమ్ అనే చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది.ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు తెలుగు లో ఈ అమ్మడు నటించలేదు.

తాజాగా ఈ అమ్మడికి సంబంధించినటువంటి చిన్నప్పటి  ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటోని  ఒకసారి పరిశీలించినట్లయితే “ఆర్య” సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది.

దీంతో కొంతమంది నెటిజన్లు ఈ అమ్మడి చిన్నప్పటి ఫోటో ని చూసి చిన్నప్పుడు శ్రావ్య చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే వచ్చి రావడంతోనే ఫర్వాలేదనిపించిన శ్రావ్య  కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో మాత్రం  విఫలమైందని చెపొపొచ్చు.

  దీనికి తోడు నటన పరంగా మంచి ప్రతిభ ఉన్నటువంటి ఈ అమ్మడికి తన నటన ని నిరూపించుకునేందుకు సరైన అవకాశం తెరమరుగైంది. అందువల్లనే ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో హీరోయిన్లకు కొనసాగలేక పోయింది.

 ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో నివాసముంటున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube