శ్రావణం శుభప్రదం.. ముస్తాబైన దేవాలయాలు..

పూజలు మాసమైన శ్రావణ మసం ప్రారంభమైంది.అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాలు ఉపవాసాలు నియమనిషలతో చేస్తారు.

 Shravanam Is Auspicious Mustabaina Temples-TeluguStop.com

ప్రతి రోజు ఒక విశిష్టత కలిగి ఉంటుంది సోమవారం శివుడు, మంగళవారం  ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వరస్వామి, ఆదివారం సూర్యునికి ఆరాధిస్తారు.శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారంతో ప్రారంభమై సెప్టెంబర్ 7 అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది.

శ్రావణమాసం వ్రతాలు పూజలు ఉపవాసాలు పెట్టింది పేరు ఈ నెలలో ఎన్నో పండుగలు వస్తాయి.నాగుల పంచమి, మంగళగౌరీ, వ్రతం వరలక్ష్మీ వ్రతం, రక్షాబంధన్ కృష్ణాష్టమి, శ్రావణమాసం ఆరంభమయ్యే పూజలకు ఆయా ప్రాంతాల్లో దేవాలయాలు ముస్తాబయ్యాయి.

 Shravanam Is Auspicious Mustabaina Temples-శ్రావణం శుభప్రదం.. ముస్తాబైన దేవాలయాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఏడాది శ్రావణమాసంలో శుక్ర, శని, సోమ మంగళవారాలు ‘నాలుగు’ చొప్పున రావడం విశేషం.నెల రోజుల పాటు ప్రతి దేవాలయాల్లో రాత్రిపూట భజనలు చేస్తారు ఆంజనేయ స్వామికి చందనంతో అభిషేకం చేస్తారు.

శ్రావణమాసం ముగింపు రోజున దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేస్తారు.

నాగుల చవితి : (12వ తేదీ) శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ నాగులచవితి కుటుంబంలో సర్ప దోషం ఉండకూడదంటు.పుట్టలున్న దేవాలయాలకు వెళ్లి నాగులు విగ్రహాలకు పాలు పోసి విగ్రహాలకు పూజిస్తారు.

నాగుల పంచమి : (13వ తేదీ) శుక్రవారం నాగుల పంచమి.చవితి రోజున ఉపవాసం ఉన్నవారు నువ్వులు ఉండలు నైవేద్యంగా పెడతారు.రాహు కేతు వాసు ఉండకుండా నాగేంద్రుల ఆశీర్వాదం తీసుకుంటారు.దారంతో మూలగా చేసి నాగేంద్ర విగ్రహాలపై ఉంచి పూజలు చేసిన తర్వాత దాని చేతికి కంకణంగా దరిస్తారు.నాగుల పంచమినే గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తారు.

లక్ష్మీ వ్రతం : (20వ తేదీ) వరాలు కురిపించాలని అష్టలక్ష్మీ దేవతా మూర్తులకు మహిళలు పూజిస్తారు.దేవాలయాలు, ఇళ్లలో సామూహికంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు చేస్తారు.

Telugu Festivals, Lakshmi Vratham, Sankatahara Chaturthi, Shravanam Is Auspicious Mustabaina Temples, Sravanam, Sri Krishna Janmashtami, Temples-

రాఖీ పౌర్ణమి : (22వ తేదీ) అన్నా చెల్లెళ్ల ప్రేమానురాగాలకు చిహ్నంగా నిలిచేదే రాఖీ పండుగ. అక్క చెల్లెల్లు పుట్టింటికి వచ్చి అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి వారిని దీవిస్తారు.అన్నలు,తమ్ములు అక్క చెల్లెళ్లకు కానుకలు ఇస్తారు.తెలుగింటి లోగిళ్లలో పండుగ శోభను తెచ్చేది రాఖీ పౌర్ణమి.

సంకటహర చతుర్థి : (26వ తేదీ)  ఇంట్లో తలపెట్టిన పనులకు అవంతరాల సంకటాల కలక్కుండా శుభప్రదంగా జరగాలని గణపతిని గరిక పత్రితో పూజ చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల వినాయకుడు ఆశీర్వాదాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయని పండితులు చెబుతుంటారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి : (30వ తేదీ) శ్రీకృష్ణ భగవానుడు పుట్టినరోజున జన్మాష్టమి అంటారు.ఈరోజు దేవాలయాల్లో భజనలు, ప్రత్యేక పూజలు చేస్తారు రాత్రి కృష్ణుడికి డోలారోహణం చేస్తారు.చిన్నారులు గోపికలు శ్రీకృష్ణుని వేషధారణతో అలరిస్తారు.మరుసటి రోజు ఉదయం ఉట్టి కొట్టే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.గ్రామాల్లో పెరుగు బసంతగా కూడా పిలుస్తారు.

Telugu Festivals, Lakshmi Vratham, Sankatahara Chaturthi, Shravanam Is Auspicious Mustabaina Temples, Sravanam, Sri Krishna Janmashtami, Temples-

మంగళ గౌరీ వ్రతాలు.శ్రావణమాసంలో మంగళవారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.మహిళలు దీర్ఘ సుమంగళి గా సకల సౌభాగ్యాలను, సంతానాన్ని పొంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం జీవించే భాగ్యాన్ని పొందడానికి ఈ వ్రతాలు చేస్తారు.  పెండ్లి కావలసిన యువతులు సరైన భాగస్వామి కోసం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు గౌరీదేవి అనుగ్రహం పొందాలంటే శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం పూజ చేస్తే మాంగల్యం సిద్ది లభిస్తుంది.

శ్రావణం పవిత్ర మాసం.శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఉపవాస దీక్షలు చేయడంతో భగవంతుని అనుగ్రహం కలిగి శుభం కలుగుతుంది మహిళలు వరలక్ష్మీ వ్రతాలను చేయడంతో వారికి ఆయురారోగ్యాలు సంపదలు కలుగుతాయని నమ్మకం.

#Festivals #Sravanam #SriKrishna #Temples #Lakshmi Vratham

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు