జెర్సీ పాపను పట్టించుకునే వారే లేరా?

టాలీవుడ్‌లో ఒక్క సినిమాతో కెరీర్ సెట్ చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.అయితే కొందరు మాత్రం ఒక్క సినిమాతో తెచ్చుకున్న గుర్తింపును సరిగా వినియోగించుకోకపోవడంతో వారు ఫేడవుత్ అవుతూ వస్తున్నారు.

 Shraddha Srinath No Offers In Tollywood, Shraddha Srinath, Jersey, Tollywood New-TeluguStop.com

కాగా కొందరికి మాత్రం అదృష్టం లేకపోవడంతో సినిమా అవకాశాలు రాక ఢీలా పడుతుంటారు.ఈ జాబితాలో చేరేందుకు మరో బ్యూటీ రెడీ అయ్యింది.

నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా నాని కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది.ఆమె తన అందంతో పాటు యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన సంగతి తెలిసిందే.నాని భార్యగా శ్రద్ధా శ్రీనాథ్ ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి.అయితే ఈ సినిమా అందుకున్న విజయంతో శ్రద్ధా శ్రీనాథ్‌కు వరుసబెట్టి ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు.

కానీ అమ్మడుకి పెద్ద సినిమాల ఆఫర్లు ఒక్కటి కూడా రాలేదు.దీంతో అడపాదడపా చిన్న చిత్రాల్లో నటిస్తూ వస్తోంది ఈ బ్యూటీ.

తెలుగులో ‘జోడి’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాలో నటిస్తోంది.ఇలా చిన్న సినిమాలు తప్ప అమ్మడుకి పెద్ద ఆఫర్లు ఏమీ రాకపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

అయితే శ్రద్ధా శ్రీనాథ్‌కు ఇతర భాషల్లో మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి.తమిళ, కన్నడ భాషల్లో అమ్మడుకి మంచి ఛాన్సులు వస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ కొంతమేర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తెలుగులో మాత్రం అమ్మడుని పట్టించుకోవడం లేదని, అందుకే ఆమెకు అవకాశాలు దక్కడం లేదని పలువురు అంటున్నారు.మరి ఇప్పటికైనా శ్రద్ధా శ్రీనాథ్‌కు ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి అంటున్నారు ఆమె అభిమానులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube