పెళ్లయ్యాక నటించకూడదని హీరోయిన్స్ కి రూల్స్ పెట్టారా! నాని హీరోయిన్ కౌంటర్

గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ గా రాణిస్తున్న వారికి కెరియర్ ఎక్కువ కాలం ఉండదు.

హీరోలు వృద్ధాప్యం వచ్చే వరకు అవకాశాన్ని బట్టి హీరోలుగానో, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో కొనసాగే అవకాశం ఉంది.

అయితే హీరోయిన్స్ కెరియర్ మాత్రం ఐదు నుంచి పదేళ్ళకి మించి ఉండదు.తరువాత నటించాలనుకున్న తల్లి, చెల్లి పాత్రలకి పరిమితం కావాల్సిందే.

ఇక చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తరువాత సినిమాలకి దూరం అయిపోతారు.అయితే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్న కూడా పెళ్లి చేసుకుంటే హీరోయిన్ అవకాశాలు కచ్చితంగా కోల్పోతుంది.

అంత వేగంగా దర్శక, నిర్మాతలు వారికి అవకాశం ఇవ్వరు.అరుదుగా మాత్రమే కొంత మంది భామలకి మాత్రమే పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా చేసే అవకాశం దొరుకుతుంది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తారా, పెళ్ళయ్యాక హీరోయిన్స్ కి డిమాండ్ తగ్గుతుందా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అనే ఓ ప్రశ్న శ్రద్ధా శ్రీనాథ్ కి ఎదురైంది.

ఈ ప్రశ్న ఆమెకి కోపం తెప్పించింది.పెళ్లి తర్వాత హీరోలు రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తున్నారు కదా.

మరి అలాంటి ప్రశ్నలు వారిని ఎందుకు వేయడం లేదు అంటూ రివర్స్ అయ్యింది.

దీనిపై నాకు మీ స్పందన కావాలి అంటూ తిరిగి ఆమె నెటిజన్లుని ప్రశ్నించింది.

దీనిపై చాలా మంది చాలా రకాలుగా స్పందించారు.పెళ్లి తర్వాత నటించాలా, వద్దా అనేది హీరోయిన్స్ ఇష్టం, అలాగే ఎలాంటి సన్నివేశాలలో నటించాలి అనే విషయంపై సలహాలు ఇచ్చే హక్కు ఎవరికీ లేదు.

సినిమా అనేది ఒక వృత్తి అది ఎలా చేయాలో డిసైడ్ చేసుకోవాల్సింది హీరోయిన్స్ అంటూ చాలా మంది ఆమెకి అండగా నిలబడ్డారు.

మే 1న ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా చూడాలని చంద్రబాబు లేఖ..!!