దిల్ రాజు బ్యానర్ లో అవకాశం పట్టేసిన శ్రద్ధా శ్రీనాథ్! లక్కు తోక తొక్కినట్లేనా  

దిల్ రాజు బ్యానర్ లో అవకాశం కొట్టేసిన జెర్సీ భామ. .

Shraddha Srinath Got Offer In Dil Raju Production-

జెర్సీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్.ఈ సినిమాలో నాని ప్రేయసిగా, భార్యగా భిన్నమైన షేడ్స్ తో అటు గ్లామర్ తో, ఇటు యాక్టింగ్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఈ భామ విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి.ఇక ఈ సినిమాలో కన్నడ భామకి అనూహ్యంగా టాలీవుడ్ లో మద్దతు లభిస్తుంది అని చెప్పాలి..

Shraddha Srinath Got Offer In Dil Raju Production--Shraddha Srinath Got Offer In Dil Raju Production-

సినిమాలో నాని పెర్ఫార్మెన్స్ కి ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో, అదే స్థాయిలో శ్రద్ధాకి కూడా గుర్తింపు వచ్చింది అని చెప్పాలి.ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీ నుంచి పూజా హెగ్డే, రష్మిక మంధన టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్స్ గా కొనసాగుతూ ఉన్నారు.ఇప్పుడు శ్రద్ధా కూడా వారి బాటలోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ దిల్ రాజు ప్రొడక్షన్ లో నాగచైతన్య హీరోగా సినిమా తెరకెక్కబోతుంది ఈ సినిమాలో శ్రద్ధని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇటీవలే శశి అనే నూతన దర్శకుడు దిల్‌రాజుకి చెప్పిన స్టోరీ నచ్చడంతో ఆయన ఓకే చేశాడని సమాచారం.ఇందులో నాగచైతన్య, శ్రద్దాశ్రీనాథ్‌లు నటించే అవకాశం ఉందిని తెలుస్తుంది.