పెళ్లి గురించి ఆలోచించే సమయం లేదంటున్న సాహో హీరోయిన్...  

ప్రముఖ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించినటువంటి సాహో చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ క్వీన్ శ్రద్ధ కపూర్ ఇప్పటికే అందరికీ బాగానే గుర్తుంటారు.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఆడి పాడి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ.

TeluguStop.com - Shraddha Kapoor Reacts About Her Marriage

అయితే ప్రస్తుతం శ్రద్ధా కపూర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే బాలీవుడ్లో ప్రముఖ సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ శ్రద్ధ కపూర్ గత కొద్దికాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు మరియు ఈ ఏడాదిలో వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు కథనాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఇప్పటి వరకూ ఈ వార్తలను పట్టించుకోకుండా కామ్ గా ఉన్నటువంటి శ్రద్ధ కపూర్ తాజాగా ఈ విషయంపై స్పందించారు.

ఇందులో భాగంగా తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అంతేకాక మరికొన్ని కొత్త ప్రాజెక్టులను ఒప్పుకున్నానని రోజు బిజీ బిజీ షెడ్యూల్ తో తీరిక లేకుండా గడుపుతున్నానని అన్నారు.అంతేకాకుండా నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించి కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వాపోయింది శ్రద్ధ.అయితే ఇక్కడ  ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ విషయంలో మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

ఈ వార్తలపై గతంలో కూడా శ్రద్ధా కపూర్ కన్నతండ్రి శక్తికపూర్ స్పందిస్తూ శ్రద్ధా కపూర్ కి ఇప్పుడే పెళ్లి చేయండి అని దానికి ఇంకా సమయం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.

#ShraddhaKapoor #ShraddhaKapoor #Shraddha Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు