శ్రద్ధాకపూర్ అందుకే మహేష్ తో చెయ్యనంది

మొత్తానికి మహేష్ బాబు – మురుగదాస్ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఒక అవగాహనకు వచ్చింది.శృతిహాసన్,కీర్తి సురేష్ లాంటి దక్షిణాది భామలను వద్దనుకున్నారు.

 Shraddha Kapoor Failed To Adjust Dates For Mahesh Babu-TeluguStop.com

ఎందుకంటే సినిమా హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు.ఉత్తరాది జనాలకు తెలిసిన ముఖమైతే మంచిది కదా.శ్రద్ధాకపూర్ ఈ సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే .కాని ఇప్పుడు చేయట్లేదు.

కథ వల్లో,మహేష్ వల్లో వచ్చిన ఇబ్బందులు కాదులేండి .అమ్మడుకి డేట్స్ అడ్జస్టు చేయడం కష్టంగా ఉందట.ఒకటా రెండా… ఒక అరడజను హింది సినిమాలు చేస్తోంది శ్రద్ధా.ఇలాంటి సమయంలో మురుగదాస్ అడిగిన డేట్స్ ని ఇవ్వలేకపోయింది శ్రద్ధా.నవంబర్ దాకా ఖాలి లేకపోవడంతో , చేసేదేమి లేక మహేష్ సినిమా నుంచి తప్పుకుంది.

ఇప్పుడు తన స్థానంలో పరిణీతి చోప్రా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.

ఈ విషయాన్ని మురుగదాస్ అనౌన్స్ చేయడమే మిగిలి ఉంది అంటున్నారు బాలివుడ్ జనాలు.ఒక బాలివుడ్ భామ వదులుకుంటే ఏం .మరో బాలివుడ్ బ్యూటి దొరికింది.కాని ఇప్పటికీ ఈ విషయంపై ఫిక్స్ కాలేమండోయ్ .ఇటు వీళ్ళది కాని, అటు పరిణితి నిర్ణయం కాని మారొచ్చుగా.

ఎలాగో షుటింగ్ మొదలవడానికి ఇంకా నెలమాత్రమే మిగిలి ఉంది కాబట్టి .రేపోమాపో మురుగదాస్ అన్నీ తేల్చేస్తాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube