వేశ్యగా మారిన బోల్డ్ బ్యూటీ! జనాలు గుర్తిస్తారా  

షార్ట్ ఫిలింలో బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న శ్రద్ధా దాస్.

Shraddha Das Play Bold Role In Short Film-shraddha Das Play Bold Role,telugu Cinema,tollywood

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన గ్లామర్ తో కుర్రాళ్ళ మనసు దోచిన శ్రద్ధా దాస్ ఆ తరువాత అనుకున్న స్థాయిలో క్రేజీ సొంతం చేసుకోలేకపోయింది. తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకి చాలా వరకు సెకండ్ లీడ్, గ్లామర్ క్యారెక్టర్స్ మాత్రమే ఇస్తూ వచ్చారు. దీంతో ఎన్ని సినిమాలు చేసిన ఆమెమ్కి సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి..

వేశ్యగా మారిన బోల్డ్ బ్యూటీ! జనాలు గుర్తిస్తారా-Shraddha Das Play Bold Role In Short Film

అయితే కెరియర్ లో ఒకటి, రెండు పాత్రలు చేసిన కూడా వాటిని జనం గుర్తుపెట్టుకోలేదు. దీంతో బాలీవుడ్ లో తన సినిమా ట్రైల్స్ లో ఈ అమ్మడు బిజీ అయిపొయింది. ఇదిలా ఉంటే ఒక వేశ్య మనో భావాన్ని ఆవిష్కరించే షార్ట్ ఫిలిం లో ఈ అమ్మడు మెయిల్ లీడ్ లో నటించింది.

ఒక కళాకారుడు, వేశ్యకి మధ్య నడిచే భావోద్వేగ ప్రయాణంతో ఆవిష్కరించిన ప్యూర్ సోల్ అనే షార్ట్ ఫిలిం ని తాజాగ హైదరాబాద్ లో రిలీజ్ చేసారు. ఇక ఈ అమ్మడు తనలో ఉన్న నటిని ఈ షార్ట్ ఫిలిం ద్వారా తెలుగు ఆడియన్స్ ని పరిచయం చేసే ప్రయత్నం చేసింది అని చెప్పాలి. మరి ఈ షార్ట్ ఫిలిం ద్వారా అయిన తెలుగు ఆడియన్స్, దర్శకులు ఆమె టాలెంట్ గుర్తించి సరైన పాత్రలు ఇస్తారేమో చూడాలి.