హిప్పీతో స్టెప్పులేస్తున్న శ్రద్ధా దాస్! హీరోయిన్ నుంచి ఐటెంకి

ఆర్ ఎక్స్ 100తో సూపర్ సక్సెస్ కొట్టి టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరో కార్తికేయ.మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న కార్తికేయ ఊహించని విధంగా కలైపులి థాను లాంటి బడా ప్రొడ్యూసర్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.

 Shraddha Das In Hippie With Kartikeya-TeluguStop.com

తమిళ దర్శకుడు టిఎస్ కృష్ణ దర్శకత్వంలో హిప్పీ అనే సినిమాకి సైన్ చేసిన కార్తికేయ ఆ సినిమా షూటింగ్ ని ముగింపు దశకి తీసుకోచ్చేసాడు.పూర్తిగా రొమాంటిక్ యాంగిల్ లో ప్లే బాయ్ తరహా క్యారెక్టర్ తో ఈ హిప్పి కథ నడుస్తుంది అని తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో స్పష్టం అయ్యింది.

ఈ సినిమాలో కార్తికేయ మరోసారి షర్టు విప్పి సిక్స్ ప్యాక్ చూపించడంతో పాటు అమ్మాయిలతో ఫుల్ రొమాన్స్ చేసేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో శ్రద్ధా దాస్ కనిపిస్తుంది అని తెలుస్తుంది.మంచి టాలెంట్, గ్లామర్ ఉన్నా కూడా టాలీవుడ్ లో సెకండ్ హీరోయిన్ ప్లేస్ కి పరిమితం అయిపోయిన శ్రద్ధా దాస్ కి గరుడ వేగ గుంటూరు టాకీస్ చిత్రాలలో పెర్ఫార్మెన్స్ చూపించుకునే పాత్రలే వచ్చాయి.అయిన కూడా ఈ భామని టాలీవుడ్ దర్శకుడు గ్లామర్ బ్యూటీగానే చూస్తున్నారు.

దీంతో ఈ భామ ప్ర్రస్తుతం హిందీ చిత్రాల మీద ద్రుష్టి పెట్టింది.ఇదిలా ఉంటే ఇందులో కార్తికేయతో ఓ ఐటెం సాంగ్ కోసం భారీగా రెమ్యునరేషన్ ముట్టచెప్పి మరీ ఈ భామని తీసుకున్నట్లు తెలుస్తుంది.

మరి ఐటెం సాంగ్ తో క్లిక్ అయితే మళ్ళీ పాపకి ఐటెం గర్ల్స్ గా అయిన తెలుగులో అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube