నటిగా మారితే అన్ని చేయాల్సిందే: శ్రద్దాదాస్

టాలీవుడ్ నటి ముంబై బ్యూటీ శ్రద్ధా దాస్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మలయాళ భాషలో కూడా నటించింది.

 Actress Shraddha Das Has To Do Everything To Become An Actress,  Shraddha Das, C-TeluguStop.com

తన అందంతో, నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు అందుకుంది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అంత అవకాశాలు అందుకోకపోగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది.

2008లో సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రద్ధా దాస్ ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా అక్కడి నుండి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

తన గ్లామర్ విషయంలో ఎంత డోసు పెంచిన కూడా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇదిలా ఉంటే ఇటీవలే మరో ప్రాజెక్టు ఏక్ మినీ కథ లో అవకాశం వచ్చింది.

ఇందులో నటించిన తనకు మంచి గుర్తింపు అందింది.

కార్తీక్ రాపోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏక్ మినీ కథ.

యువి కాన్సెప్ట్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఎంటర్టైనర్ గా బాగా ఆకట్టుకుంది.ఇక ఇందులో శ్రద్ధాదాస్ కీలక పాత్రలో నటించగా తన పాత్రతో బాగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే తాజాగా తెలుగు సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకుంది.

అందులో తను సిగరెట్టు కాలుస్తూ గ్లామర్ లుక్ లో కనిపించగా అందులో నిజానికి తనకు సిగరెట్ తాగడం నచ్చదని కానీ నటిగా మారినప్పుడు నచ్చకపోయినా సరే అన్ని చేయాల్సిందే అంటూ ఆ ఫోటో షేర్ చేసుకుంది.

అంతేకాకుండా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఇక ఇది చూసిన నెటిజనులు రకరకాలుగా స్పందించగా.ఇది నిజమైన సిగరెటా లేదా డమ్మి నా అని ప్రశ్నించారు.లేదు ఇది నిజం సిగరెట్టు అని స్పందించింది శ్రద్ధాదాస్.ఇక ఈ బ్యూటీ మళ్లీ అవకాశాలు అందుకోగా ప్రస్తుతం తెలుగులో, కన్నడలో వరుస సినిమాలలో నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube