అతడు అలా చేసుంటే చంపేందుకు కూడా వెనకాడనంటున్న షోయబ్ అక్తర్...

ఒకప్పుడు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే బ్యాట్స్ మెన్ల గుండెల్లో భయం పుట్టించిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటాడు.అయితే ఇతడు అంతర్జాతీయ క్రికెట్లో దాదాపుగా 224 మ్యాచ్ లు ఆడి 442 వికెట్లను తీశాడు.

 Shoyab Akthar, Pakistan Former Bowler,  Wasim Akram,  Sensational Comments, Matc-TeluguStop.com

ఒకానొక సమయంలో పాకిస్థాన్ జట్టుకు ఎన్నో అద్వితీయ విజయాలను అందించాడు.ఆ మధ్య కాలంలో పేలవ ఫామ్ కొనసాగుతుండడంతో తనంతట తానే షోయబ్ అక్తర్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు.

ఆ తరువాత ఒకపక్క పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి సేవలు అందిస్తూనే మరోపక్క యూట్యూబ్లో క్రికెట్ కి సంబంధించినటువంటి ఛానల్ ని రన్ చేస్తున్నాడు.

అయితే తాజాగా షోయబ్ అక్తర్ పాకిస్తాన్ జట్టులో మ్యాచ్ ఫిక్సింగ్ మరియు బుకింగ్ రెఫరీల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా తాను జట్టులో ఉన్నప్పుడు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తన సామర్థ్యంతో జట్టుకి మంచి విజయాలను అందించాడని, కానీ ఎప్పుడూ కూడా తనతో మ్యాచ్ ఫిక్సింగ్ మరియు బుకింగ్స్ వంటి వివరాల గురించి చర్చించలేదని తెలిపాడు.

ఒకవేళ వసీమ్ అక్రమ్ అలాంటి విషయాల గురించి తనతో చర్చించి ఉంటే అతడిని చంపడానికి కూడా వెనుకాడే వాడిని కాదని షోయబ్ అక్తర్ తెలిపాడు.

అయితే ఎందుకు ఈ విషయం గురించి చెబుతున్నానంటే ప్రస్తుతం కొందరు యువ ఆటగాళ్లు డబ్బు పై ఉన్న మోజు కారణంగా తమ క్రికెట్ కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారని ఇది సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అంతేగాక అప్పట్లో తమ జట్టులో ఉన్నటువంటి సీనియర్ ఆటగాళ్ళకి గౌరవం మరియు క్రమశిక్షణ ఉండేదని ఇప్పుడు ఉన్నటువంటి యువ ఆటగాళ్లకు అది లేదు ఇది చాలా బాధాకరమైన విషయమని కూడా పలుమార్లు గతంలో వాపోయాడు.

ప్రస్తుతం షోయబ్ అక్తర్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ మరియు క్రికెట్ సంబంధాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube