పరిశ్రమ భూములకు షోకాజ్ నోటీసులు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పరిశ్రమల పేరుతో భూములు పొంది ఎలాంటి కార్యక్రలాపాలు ప్రారంభించని వారిపై ఉక్కుపాదం మోయనుంది.

 Showcause Notices For Industrial Lands   Showcause Notices, Industrial Lands, Kt-TeluguStop.com

ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించాడు.ఇప్పటికే పరిశ్రమల పేరుతో భూములు కొని నిర్ణీత గడువు లోపల కార్యకలాపాలు ప్రారంభించకుంటే, కంపెనీల కోసం కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

మంగళవారం మంత్రి కేటీఆర్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఈ-స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.పరిశ్రమలు ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వ భూములు తీసుకున్నారు.

ఇప్పటికీ ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించలేదు.నిర్ణీత సమయంలో కార్యక్రమాలను ప్రారంభించాలి.

ప్రభుత్వం మీకిచ్చిన సమయంలోపు ఎలాంటి నిర్మాణం చేయకపోతే ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకోవడం జరుగుంది. హైదరాబాద్ కార్పొరేషన్ కార్యకలాపాల విస్తరణ పెంచాలని అధికారులను ఆదేశించాడు.

హైదరాబాద్ ఫార్మాసిటీపై అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఫార్మా సిటీని కాలుష్య రహితంగా అభివృద్ధి చేయాలన్నారు.పరిశ్రమ విస్తరణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

త్వరలో నగరంలో ఫార్మా కంపెనీల నుంచి వెలువడే కాలుష్యాన్ని కట్టడి చేసి కాలుష్య రహితంగా తీర్చుదిద్దుతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube