రియా అరెస్ట్‌ తర్వాత మరింత మందికి టెన్షన్‌

అనుకున్నదే జరిగింది. శోవిక్‌ అరెస్ట్‌ తర్వాత ఆమె సోదరి రియా కూడా అరెస్ట్‌ అయ్యింది.

 Ria Arrest So Many Bollywood Actors Are Getting Tension, Shovik, Reha Chakravart-TeluguStop.com

డ్రగ్స్‌ కొనుగోలు మరియు వినియోగం కారణంగా ఆమెను అరెస్ట్‌ చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు.ఈ కేసును విచారిస్తున్న కొద్దికొత్త పేర్లు వస్తున్న నేపథ్యంలో ఎన్‌సీబీ అధికారులు నోరు వెళ్లబెడుతున్నారు.

రియా చక్రవర్తిని విచారించిన సమయంలో దాదాపుగా 30 మంది పేర్లను ఆమె తెలియజేసినట్లుగా తెలుస్తోంది.పలు పార్టీల్లో ఆమె పాల్గొన్న సమయంలో ఎవరు ఎవరు డ్రగ్స్‌ తీసుకున్నారు అనే విషయంలో ఆమె నోరు విప్పిందట.

ఆమె చెప్పిన వివరాల ప్రకారం కొందరిని విచారించేందుకు సిద్దం అవుతున్నారు.అందులో భాగంగా ఇప్పటికే కొందరికి నోటీసులు ఇవ్వబోతున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ లో ఉన్న ప్రముఖ దర్శకుడు ఏ పార్టీ ఏర్పాటు చేసిన అక్కడ డ్రగ్స్‌ ఖచ్చితంగా ఉంటాయట.ఆయన ఇచ్చే పార్టీలకు కేవలం డ్రగ్స్‌ కోసం వెళ్లే వారు కూడా ఉంటారని రియా చెప్పిందట.

ఆ దర్శకుడు ఎవరు అనే విషయాన్ని పక్కన పెడితే ఒక తెలుగులో ఫేమస్‌ అయిన హీరోయిన్‌ కు రియా మంచి సన్నిహితురాలు.కనుక ఇప్పుడు ఆమె గురించి కూడా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఆమె గతంలో లేదా ఈమద్య కాలంలో ఏమైనా డ్రగ్స్‌ తీసుకుని ఉంటుందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆ హీరోయిన్‌ ను కూడా ఎన్‌సీబీ అధికారులు విచారిస్తారా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube