సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం పాటు ఆ ఇంటిలో ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు.ఇది మన ఆచార సాంప్రదాయాలలో భాగంగా పూర్వీకుల నుంచి ఆచరిస్తూ వస్తున్నారు.
కేవలం పూజలు మాత్రమే కాకుండా దీపారాధన కూడా చేయకుండా దేవుడి పటాలు ఎత్తి పెడుతుంటారు.చనిపోయిన వారికి సంవత్సరీకం చేసుకున్న తర్వాత తిరిగి మన ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తాము.
కానీ ఇలాంటి పద్ధతి శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు.
దీపం శుభాన్ని సూచిస్తుంది.
అటువంటి దీపం ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు.అందుకోసమే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం జరుగుతుంది.
ఇలాంటి శుభకరమైన దీపాన్ని సంవత్సరంపాటు చేయకుండా ఉండాలని ఏ శాస్త్రంలోనూ లేదు.చనిపోయిన వారి ఇంట్లో 11 రోజుల తర్వాత ఇంటిని మొత్తం శుభ్రపరుచుకుని పూజ చేస్తారు.
అలాగే 11వ రోజు నుంచి మనం నిత్యం చేసే దీపారాధన చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
మరణించిన ఇళ్లలో కేవలం ఆ పదకొండు రోజులు మాత్రమే ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించ కూడదు.శాస్త్రం ఇంత వరకు మాత్రమే చెబుతుంది.కానీ సంవత్సరం పాటు ఎటువంటి పూజలు నిర్వహించకూడదని ఎక్కడ చెప్పలేదు.
మనం రోజు జరుపుకునే నిత్య పూజలను చేసుకోవచ్చు.అంతేకానీ కొత్తగా పూజ కార్యక్రమాలను నిర్వహించకూడదు.
ప్రతిరోజు మన ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా ఎలాంటి గ్రహ దోషాలు ఉన్న, ఇంటి సభ్యులకు ఏవైనా దోషాలు ఉన్న వాటిని ఆపగలిగే శక్తి ఆ దైవారాధనకు ఉంటుంది.అలాంటిది మన ఇంట్లో సంవత్సరం పాటు దీపారాధన చేయకుండా ఉంటే మంచిది కాదని, కేవలం ఆ పదకొండు రోజులు మినహా, ప్రతిరోజు దీపారాధన ఖచ్చితంగా చేయాలని శాస్త్రం మనకు తెలియజేస్తుంది.