ప్రతిపక్షాల దూకుడుతో టీఆర్ఎస్ పూర్తి స్థాయి ఫోకస్ చేయక తప్పదా?

తెలంగాణలో ప్రతిపక్షాలు తమ దూకుడుని రోజు రోజుకు పెంచుతున్నాయి.ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం పోటీ పడుతున్న పరిస్థితిలో టీఆర్ఎస్ ఇక మరింతగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంది.

 Shouldn’t The Trs Be Fully Focused On The Aggression Of The Opposition Telanga-TeluguStop.com

లేకపోతే ప్రజల్లో హుజూరాబాద్ లో జరిగిన సీన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.అందుకే టీఆర్ఎస్ నేతలు రకరకాలుగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయి వరకు ప్రజల్లోకి వెళ్ళడం లేదు.

అందుకే కేసీఆర్ ఏకంగా రంగంలోకి దిగి బీజేపీపై విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది.ఇక బీజేపీ రోజు రోజుకు మరింతగా విమర్శల విషయంలో దూకుడును పెంచుతూ అంతేకాక సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేస్తూ యాక్టివ్ గా ఉంటున్న పరిస్థితి ఉంది.

అందుకే అన్ని విధాలుగా ఫోకస్ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.ఇందులో భాగంగానే కేటీ ఆర్ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకలాపాలను యాక్టివ్ చేయాలని క్యాడర్ కు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుతం చాలా వరకు పార్టీల పరంగా దూకుడుగా వెళ్తూ తమ ప్రభావాన్ని పెంచుకునే దిశగా ముందుకు వెళ్తున్నాయి.టీఆర్ఎస్ ఇక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా వ్యవహరించకపోతే ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బలంగా పోరాడలేని పరిస్థితికి చేరుకుంటారు
.

Telugu @cm_kcr, @trspartyonline, Bandi Sanjay, Bjp, Revanth Reddy, Telangana, Ts

అప్పుడు ఇక ప్రతిపక్ష పార్టీలవి పై చేయి అవుతుంది.అందుకే ఈ వాస్తవం గ్రహించి కేసీఆర్ కాని కేటీఆర్ కాని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని అదే విధంగా ఇక రానున్న రోజుల్లో టీఆర్ఎస్ అనుకూల పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలా పార్టీ వ్యవహరించాలని టీఆర్ఎస్ అధినాయకత్వం క్యాడర్ కు సూచిస్తున్న పరిస్థితి ఉంది.మరి ఫక్తు రాజకీయ పార్టీగా మారామన్న టీఆర్ఎస్ రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube