పరగడుపునే పండ్లను తినవచ్చా..? తింటే ఏమవుతుందో తెలుసా?

పండ్లు ఆరోగ్యానికి మంచివని మనకు తెలిసిన విషయమే.ఒకప్పుడు పండ్లు సీజన్ ప్రకారమే వచ్చేవి.

 Fruits On Empty Stomach,health Benefits, Telugu Health, Fruits Benefits-TeluguStop.com

ఇప్పుడు చాలా రకాల పండ్లు సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా వస్తున్నాయి.అయితే పండును ఏ సమయంలో తిన్న మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

అయితే ఈ మధ్య కాలంలో ఒక వాదన పుట్టుకొచ్చింది.

అది ఏమిటంటే పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని, పండ్లను తినటానికి కూడా ఒక నిర్దిష్ట సమయం ఉంటుందని, పరగడుపున అసలు తినకూడదని అంటున్నారు నిపుణులు.

ఒకవేళ పరగడుపున పండ్లను తింటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

సాధారణంగా ఏ పండులోనైనా ఎంతో కొంత పీచు పదార్ధం ఉంటుంది.ఉదయం పరగడుపున,భోజనం చేసిన వెంటనే తింటే ఆ పీచు పదార్ధం జీర్ణం కాక అలాగే ఉండిపోతుంది.దాంతో గ్యాస్,అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

అయితే ఆయుర్వేదం ప్రకారం ఎటువంటి సమస్యలు లేనివారు పరగడుపున పండ్లు తినవచ్చు.

ఇక గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలతో బాధపడే వారు పరగడుపున, భోజనం చేసిన వెంటనే పండ్లను ముఖ్యంగా సిట్రస్ జాతి పండ్లను అసలు తినకూడదు.

భోజనం చేసిన గంట తర్వాత పండ్లను తినవచ్చు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube