రాత్రి పడుకునే ముందు పెరుగన్నం తింటే ఏమవుతుందో తెలుసా?

వంట చేయడం రానివాళ్లు కూడా ఈజీగా చేసే పని ఏదన్నా ఉందా అంటే పెరుగు తోడు పెట్టడం… వేడి అన్నం వండుకుని ,పెరుగు తోడు పెట్టుకుని,ఆవకాయ నంజుకు తింటే ఆ టేస్టే వేరు.కానీ రాత్రి పూట పెరుగు అన్నం తినాలి అంటే కొందరు ఆలోచిస్తారు.

 Should You Eat Curd Rice At Night Details, Curd Rice, Curd, Health Effect, Cold,-TeluguStop.com

దగ్గు, జలుబు వస్తుందని జాగ్రత్త పడతారు.ముఖ్యంగా శీతాకాలంలో అయితే మరీ.అసలు రాత్రి పెరుగు తినొచ్చా.? లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది.అయితే పెరుగును రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.దీంతో కఫం వస్తుంది.తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు.ఇలాంటి వారు రాత్రి పూట పెరుగన్నం తినకపోవడమే మంచిది.

పెరుగుతో భోజనం చేసి వెంటనే పడుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

పైన చెప్పుకున్నట్లు పెరుగుకు చల్లబర్చే గుణం ఉంది.అంటే ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది.

భోజనం జీర్ణం అయ్యేటప్పుడు వేడి పుడుతుంది.దానిని పెరుగు చల్లబర్చడం వల్ల స్లోగా అరుగుదల నడుస్తుంది.కాబట్టి రాత్రి పూట పెరుగు తింటే…కనీసం రెండు గంటల గ్యాప్ ఇచ్చిన తర్వాతే పడుకోవాలి.లేదంటే సరిగా ఆహారం జీర్ణం అవ్వదు.

ఇక దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట తినవచ్చు.దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినడం ఉత్తమం.దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు.

Should You Eat Curd Rice At Night Details, Curd Rice, Curd, Health Effect, Cold, Cough, Digestive Problems, Telugu Health Tips, Mucus, Curd Rice At Night - Telugu Cough, Curd, Effect, Mucus, Telugu Tips

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube