గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా ?

సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు పూజారికి దక్షిణ ఇస్తూ ఉంటాం.అయితే పూజారికి దక్షిణ తప్పని సరిగా ఇవ్వాలి అనే నియమం ఏమి లేదు.

 Should We Offer Dakshina To Priests In Temples Details, Dakshina, Poojari, Templ-TeluguStop.com

కాని నిత్యం భగవంతుని సేవలో ఉండే పూజారికి మనకు తోచిన విధంగా దానం చెయ్యడంలో తప్పు ఏముంది? అన్నింటికీ డబ్బులు అవసరం అందరికీ డబ్బులు కావాలి.పూర్వకాలంలో జమిందారీ వ్యవస్థ మరియు రాజరికపు వ్యవస్థ ఉండేవి వారు తమకు తోచిన విధంగా పూజారికి అవసరమైన సహాయం చేసేవారు.

ఇప్పుడు కాలం మారటంతో పూజారికి దక్షిణ వేసే భక్తులు సంఖ్య కూడా తగ్గింది.

కావున వ్రతాలు పండుగులకు పూజారులు తమంతట తాము భక్తి కొరకు ధన సహాయం అడగడం చాల చోట్ల కనపడుతుంది.

పూజారికి ఎంత దక్షిణ ఇవ్వాలి అనే విషయానికి వస్తే….ఒక అతిధి మీ ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తే 101 రూపాయలు అవుతుందని అనుకొందాము మరి అదే ఒక పండుగ రోజు గుడిలో పూజారికి దక్షిణ 11 రూపాయలు వేస్తే మనకు పెద్ద భారం కాదు కదా! గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా అనే సందేహం పక్కన పెట్టి మీకు తోచిన విధంగా సహాయం చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube