ప్లీనరీతో టీఆర్ఎస్ ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానం ఇవ్వనుందా?

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ త్వరలో జరగనున్న విషయం తెలిసిందే.టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించబోతున్నారు.

 Should The Trs Respond Sharply To The Opposition's Criticisms With The Plenary-TeluguStop.com

అయితే ఈ ప్లీనరీలో ఇటు హుజురాబాద్ ఉప ఎన్నికకు, ఇటు ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.అయితే గత సంవత్సర కాలంగా ప్రతిపక్షాలకు, టీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్దం జరుగుతోంది.

అయితే ప్రతిపక్షాల విమర్శలకు టీఆర్ఎస్ అంతగా స్పందించిన పరిస్థితి లేదు.దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తే పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉండటమే కాదు, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పెద్ద ఎత్తన నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

అందుకే ఇటు ఉద్యోగ  నోటిఫికేషన్ లపై అంతేకాక ఇంకా ప్రభుత్వం పై ప్రజలు అగ్రహంగా ఉన్న అంశాలపై ఈ ప్లీనరీలో ముఖ్యమంత్రి కెసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు.

దీంతో అధికార పక్షం  విమర్శలకు ప్రతిపక్షాలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.

దీంతో మరోసారి ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల తూటాలు పేలే అవకాశం ఉంది.అయితే ఈ ప్లీనరీతో టీఆర్ఎస్ కార్యకర్తలకు పెద్ద ఎత్తున భరోసా ఇవ్వనున్నారు.

ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విషయం కెటీఆర్ వద్దకు కూడా వెళ్ళిన పరిస్థితుల్లో ప్లీనరీలో కార్యకర్తలను ఉద్దేశించి ఎక్కువ శాతం ప్రసంగించే అవకాశం ఉంది.ఎందుకంటే ఇక రెండున్నర  సంవత్సరాలలో సార్వత్రిక  ఎన్నికలు జరగనున్న తరుణంలో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉంటుంది.

అంతేకాక అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలతో కూడా కెటీఆర్ స్వయంగా మాట్లాడే అవకాశం ఉంది.మరి ప్లీనరీలో టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube