ఒకప్పటి ఫార్ములా ఇప్పుడు టీఆర్ఎస్ కు అడ్డంకిగా మారనుందా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికర పరిణామాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉన్నా అనధికారికంగా ఎన్నికల వాతావరణం మొదలైందని చెప్పవచ్చు.

 Should The One Time Formula Now Become A Barrier To Trs , Bjp Party , Revanth Re-TeluguStop.com

అయితే ఇప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏ స్ట్రాటజీలతో అయితే అధికారంలోకి వచ్చిందో వచ్చే ఎన్నికల్లో అదే స్ట్రాటజీలను ప్రయోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అదే తీర్మాణాల స్ట్రాటజీ తో అన్ని కులాలను ఏకం చేసి టీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్మానాలు చేయడంతో ఇక మెజారిటీ ఓటు శాతం టీ ఆర్ఎస్ కు అనుకూలంగా పోల్ అవడం తో టీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకలా మారిన పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న సంఘాలతో ఇప్పటి నుండే సంప్రదింపులు కొనసాగిస్తున్న తరుణంలో ఇప్పుడు తీర్మాణాల పరంపర అనేది టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కొనసాగితే టీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంది.

అయితే ఎంత వరకు కెసీఆర్ లాంటి అపరచాణక్యుడు ఆ తరహా ప్రతిపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తాడనేది చూడాల్సి ఉంది.

ఎందుకంటే కెసీఆర్ ఒకవేళ ఓటమి చెందితే తెలంగాణ రాజకీయాల్లో అదో పెద్ద సంచలనంగా మారే పరిస్థితి ఉంటుంది కావున ఎంత మేరకు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేస్తున్న ఈ తీర్మాణాల స్ట్రాటజీ ఫలిస్తుందనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది.ఎందుకంటే ఇప్పటికే అన్ని పార్టీలు కెసీఆర్ కు వ్యతిరేకంగా వెళ్తున్న పరిస్థితిలలో ఎంత మేరకు అది ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మారుతుందనేది ప్రస్తుతం అందరిలో తొలుస్తున్న ప్రశ్న.

ఏది ఏమైనా రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube