ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ ఇక ప్రజలకు సమాధానం ఇవ్వక తప్పదా?

తెలంగాణ ప్రభుత్వం ఇక యాసంగి వరి పంటను కొనుగోలు చేయబోమని ప్రకటించడంతో ఇక ఒక్క సారిగా బీజేపీ టీఆర్ఎస్ భగ్గుమన్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని అందుకే వరి ధాన్యం కొనుగోలు చేయమని ప్రకటించిందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్ లో ఈటెల నిర్వహించిన ర్యాలీ సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 Should The Bjp No Longer Answer To The People On Grain Purchases Bjp Party, Band-TeluguStop.com

అంతేకాక తెలంగాణ రైతాంగం అందరూ వరి మాత్రమే వేయాలని ప్రభుత్వం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని పూర్తిగా కొనేలా పోరాటం చేస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ఎత్తున కలకలం రేపాయి.ఇక ఈ వ్యాఖ్యలపై కెసీఆర్ స్పందిస్తూ కేంద్రం నుండి వచ్చిన పత్రాలను చూపిస్తూ బండి సంజయ్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.

కెసీఆర్ వేసిన ఈ వ్యూహం ఫలించింది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Farmers Strike, Telangana-Political

ఇక ఆ తరువాత బండి సంజయ్ నుండి ఈ విషయంపై సరైన స్పందన రాకపోవడంతో కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కూడా స్పందించాల్సిన అవసరం వచ్చింది.అయితే ఏది ఎలా ఉన్నా రైతులలో కెసీఆర్ అంటే సానుకూల భావన ఉంది కాబట్టి బీజేపీని విశ్వసించే పరిస్థితి లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.అయితే కెసీఆర్ సవాల్ విసిరినట్టు పండించిన మొత్తం వరి ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకరావాలనే దానిపై బీజేపీ నేతల నుండి స్పందన కరువైంది.

ఏది ఏమైనా ఈ విషయాన్ని కెసీఆర్ అంత సులభంగా వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు.బీజేపీ నుండి మొత్తం వరి ధాన్యాన్ని కొంటామని ప్రకటన వచ్చేంత వరకు ఇంకా రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్న పరిస్థితి ఉంది.

ఇక ఏది ఏమైనా బీజేపీ మాత్రం ప్రజలకు తప్పక సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube