పొత్తు లేకుండా టీడీపీ పోటీ చేయ‌దా.. గ‌త చ‌రిత్ర ఏం చెబుతోంది..?

ఒక‌సారి టీడీపీ చ‌రిత్ర‌ను చూసుకుంటే గ‌న‌క ఇప్ప‌టికే అధిక సార్లు అధికారంలోకి వచ్చింద‌ని అంద‌రికీ తెలిసిందే.కానీ ఎలా వ‌చ్చింది అంటే మాత్రం సింగిల్ గా పోటీ చేసి మాత్రం కాద‌నే చెప్పాలి.

 Should Tdp Compete Without Alliance What Does Past History Say . Tdp, Chandraba-TeluguStop.com

అనేక సార్లు ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకునే గెలిచింది గానీ ఇప్ప‌టి దాకా సింగిల్ గా పోటీ చేసి మెజార్టీ స్థానాల‌ను సొంతం చేసుకోలేదు.మ‌రీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ఒక్కటంటే ఒక్క ఎన్నికలోనూ సింగిల్‌గా గ‌ర్జించ‌లేక‌పోయింది.

కాగా పొత్తులు పెట్టుకున్న స‌మ‌యంలోనూ ఓడిపోయిన చ‌రిత్ర టీడీపీకి ఉంది.

ఇక దీన్ని చంద్ర‌బాబు కూడా ఒప్పుకున్నారు.త‌మ పార్టీ పొత్తుల్లో క‌చ్చితంగా గెలుస్తుందని చెప్ప‌లేమ‌ని ఎందుకంటే గ‌తంలో ఓడిపోయ‌న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.2009 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఓడిపోయారు.అప్పుడు టీఆర్ఎస్ అలాగే వామపక్షాలతో ఉన్న పొత్తు ఆయ‌న‌కు బెడిసికొట్టింద‌తి.కానీ 2014లో బీజేపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తుతో అధికారాన్ని ద‌క్కించుకుంది.అయితే 2019 ఎన్నికల్లో ఒంట‌రిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది.దీంతో చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ పొత్తు అంశంమీద ప‌డ్డార‌ని చెబుతున్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Ysrcp-Telugu Political News

రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుంటే గానీ త‌మ పార్టీకి భ‌విష్య‌త్ ఉండ‌ద‌నే ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు క‌నిపిస్తున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.కానీ బీజేపీ ఆ అవ‌కాశం ఇవ్వ‌ట్లేదు.ఇ్ ఇక మిగిలింది జనసేనతో మళ్లీ క‌లిసి పోటీ చేయ‌డం.

అయితే ఇది చంద్ర‌బాబుకు ఎంత మేర‌కు క‌లిసొచ్చినా పార్టీకి మాత్రం న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆపార్టీ నేత‌లు భావిస్తున్నారు.మొత్తంగా ఎటు చూసుకున్నా కూడా టీడీపీ అస‌లు పొత్తులు లేకుండా పోటీ చేసే అవకాశ‌మే క‌నిపించ‌ట్లేద‌న్న‌మాట‌.

మ‌రి రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాంటి పొత్తులు పెట్టుకుంటుందో అని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube