వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో షర్మిలనే కెసీఆర్ కు ప్రచారాస్త్రంగా మారనుందా?

తెలంగాణ రాజకీయాల్లో కొత్త కొత్త పార్టీల ప్రవేశంతో అసలు ఎవరి వ్యూహం ఏమిటో అర్ధం కాని రీతిలో ప్రస్తుత పరిస్థితి ఉంది.ప్రస్తుతం వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించి తనదైన శైలిలో ప్రభుత్వం పై విమర్శలు గుప్పించుకుంటూ ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

 Should Sharmila Be The Campaign Tool For Kcr In The Coming General Elections Det-TeluguStop.com

అయితే ప్రస్తుతం షర్మిల పాదయాత్రపై కానీ షర్మిల పార్టీపై కానీ ఎవరూ స్పందించని పరిస్థితి ఉంది.రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు షర్మిల ది పార్టీ కాదని, అది ఒక ఎన్జీవో సంస్థ అని మీడియా కూడా ఆమెను పెద్దగా సీరియస్ గా తీసుకోవద్దని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

అయితే ఆంధ్రా ప్రాంతానికి చెందిన షర్మిల తెలంగాణలో ఎలా రాజకీయం చేయాలని చూస్తారని ఒకవేళ రాజకీయం చేసినా ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్న పరిస్థితి ఉంది.అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో షర్మిలనే ప్రచారాస్త్రo గా కెసీఆర్ ఉపయోగించుకునే అవకాశం ఉంది.

తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు కాకముందే తెలంగాణను దోచుకోవడానికి మరల ఆంధ్రావాళ్ళు బయలుదేరారని టీఆర్ఎస్ అధికారంలో లేకుంటే మరల ఆంధ్రావాళ్ళ పెత్తనం మొదలవుతుందనే కోణంలో ప్రచారం చేసే అవకాశం ఉంది.

Telugu @cm_kcr, Cm Kcr, General, Prajaprasthanam, Revanth Reddy, Telangana, Ys S

దీంతో మిగతా ప్రతిపక్షాల వ్యూహాలన్నీ దెబ్బ తినడమే కాకుండా ఒక్కసారిగా కెసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారే పరిస్థితి ఉంది.అందుకే కెసీఆర్ షర్మిల రాజకీయ పర్యటనపై ఇప్పటి వరకు ఏ ఒక్క విమర్శగాని చేయని పరిస్థితి ఉంది.అంటే పరోక్షంగా షర్మిలకు మద్దతిస్తున్నట్లేనని కొంత చర్చ నడుస్తోంది.

మరి వచ్చే సార్వత్రిక ఎన్నికను ప్రచారాస్త్రo గా మార్చుకుంటారా లేక మరేదైనా వ్యూహాన్ని ప్రయోగిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube