సీతాఫలం.ఎంత యమ్మీ యమ్మీ టేస్ట్‌ను కలిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇష్టంగా ఇష్టపడి వాటిని తింటుంటారు.ఇక పోషకాల విషయానికి వస్తే.
విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అబ్బో… ఇలా ఎన్నెన్నో సీతాఫలంలో నిండి ఉంటాయి.అయితే సీతాఫలం ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.
దీని విషయంలో చాలా మందికి చాలా ఆపోహలు ఉన్నాయి.
వాటిలో `అధిక బరువు ఉన్న వారు సీతాఫలం తినకూడదు.
తింటే మరింత వెయిట్ గెయిట్ అవుతారు` అన్నవారు చాలా మందే ఉన్నారు.ఈ క్రమంలోనే ఓవర్ వెయిట్ ఉన్న వారు, డైటింగ్ చేసే వారు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సీతా ఫలాన్ని ఎవైడ్ చేస్తుంటారు.
కానీ, సీతాఫలం తింటే బరువు పెరుగుతారు అన్నది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు నిపుణులు.
నిజానికి సీతాఫలంలో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువగా.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.అందు వల్ల సీతా ఫలం తీసుకుంటే వెంటనే కడుపు నిండుతుంది.
శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.అదే సమయంలో త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది.
తద్వారా చిరు తిండ్లపై మనసు మల్లనే మల్లదు.ఫలితంగా వెయిట్ లాస్ అవుతాయి.
అందుకే బరువు తగ్గేందుకు డైటింగ్ చేసే వారు డైట్లో సీతాఫలంను చేర్చుకుంటే మరింత ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వొచ్చని అంటున్నారు నిపుణులు.పైగా సీతాఫలం తింటే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడి.గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలేవి దరి చేరకుండా ఉంటాయి.రక్త హీనత, గుండె సంబంధిత వ్యాధులు, ఆల్జీమర్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండొచ్చు.
.