అధిక బ‌రువున్న వారు సీతాఫ‌లం తిన‌కూడ‌దా..?

Should Overweight People Not Eat Custard Apple? Custard Apple, Benefits Of Custard Apple, Custard Apple For Health, Over Weight, Weight Loss, Health, Health Tips, Good Health

సీతాఫ‌లం.ఎంత య‌మ్మీ య‌మ్మీ టేస్ట్‌ను క‌లిగి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 Should Overweight People Not Eat Custard Apple? Custard Apple, Benefits Of Custa-TeluguStop.com

అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఇష్టంగా ఇష్ట‌ప‌డి వాటిని తింటుంటారు.ఇక పోష‌కాల విష‌యానికి వ‌స్తే.

విట‌మిన్ సి, విట‌మిన్ బి, ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ అబ్బో… ఇలా ఎన్నెన్నో సీతాఫ‌లంలో నిండి ఉంటాయి.అయితే సీతాఫ‌లం ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.

దీని విష‌యంలో చాలా మందికి చాలా ఆపోహ‌లు ఉన్నాయి.

వాటిలో `అధిక బ‌రువు ఉన్న‌ వారు సీతాఫ‌లం తిన‌కూడ‌దు.

తింటే మ‌రింత వెయిట్ గెయిట్ అవుతారు` అన్న‌వారు చాలా మందే ఉన్నారు.ఈ క్ర‌మంలోనే ఓవ‌ర్ వెయిట్ ఉన్న వారు, డైటింగ్ చేసే వారు ప్రకృతి ప్రసాదించిన అద్భుత‌మైన సీతా ఫ‌లాన్ని ఎవైడ్ చేస్తుంటారు.

కానీ, సీతాఫ‌లం తింటే బ‌రువు పెరుగుతారు అన్న‌ది కేవ‌లం అపోహ మాత్ర‌మే అని అంటున్నారు నిపుణులు.

నిజానికి సీతాఫ‌లంలో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువగా.

ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది.అందు వ‌ల్ల సీతా ఫ‌లం తీసుకుంటే వెంట‌నే క‌డుపు నిండుతుంది.

శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.అదే స‌మ‌యంలో త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది.

త‌ద్వారా చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌నే మ‌ల్ల‌దు.ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతాయి.

అందుకే బ‌రువు త‌గ్గేందుకు డైటింగ్ చేసే వారు డైట్‌లో సీతాఫ‌లంను చేర్చుకుంటే మ‌రింత ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వొచ్చ‌ని అంటున్నారు నిపుణులు.పైగా సీతాఫ‌లం తింటే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డి.గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లేవి ద‌రి చేర‌కుండా ఉంటాయి.ర‌క్త హీన‌త‌, గుండె సంబంధిత వ్యాధులు, ఆల్జీమ‌ర్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండొచ్చు.

.

Video : Should Overweight People Not Eat Custard Apple? Custard Apple, Benefits Of Custard Apple, Custard Apple For Health, Over Weight, Weight Loss, Health, Health Tips, Good Health

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube