అయ్యోపాపం : చేయి కాలిందని కోల్గేట్‌ పెట్టింది, ఆ తర్వాత ఏమందో తెలుస్తే నోరెళ్ళబెడతారు  

Should Never Use Tooth Paste To Soothe Burns-telugu Viral In Social Media,tooth Paste To Soothe Burns,viral In Social Media

సమస్త రోగాలకు, గాయాలకు, జబ్బులకు కూడా ఇంట్లోనే చికిత్స ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. ఇంట్లో ఉండే కిచెన్‌ రూంలో పలు జబ్బులకు సంబంధించిన ఔషదాలు మనకు తెలియకుండానే ఉంటాయని అంటారు. అది నిజమే అయ్యి ఉండవచ్చు..

అయ్యోపాపం : చేయి కాలిందని కోల్గేట్‌ పెట్టింది, ఆ తర్వాత ఏమందో తెలుస్తే నోరెళ్ళబెడతారు-Should Never Use Tooth Paste To Soothe Burns

కాని మనం వాటిని సరిగా ఉపయోగించకుంటే పరిస్థితి తిరగబడే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు మొదటికే మోసం వస్తుంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా పరిస్థితి అవుతుంది.

తాజాగా మలేషియాలో ఒక మహిళకు ఈ సామెత సరిగ్గా సూట్‌ అయ్యేలా సంఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మలేషియాకు చెందిన జిగాబో అనే మహిళ ఏదో పని చేస్తుండగా చేయి కాస్త కాలింది. ఈ కొద్దిగా కాలితే హాస్పిటల్‌ వరకు ఏం వెళ్తాంలే అని భావించి ఎక్కడ చూసిన దాని ప్రకారం ఇంట్లో ఉన్న టూత్‌ పేస్ట్‌ను ఆ కాలిన గాయం వద్ద మర్దన చేసింది. అలా రెండు రోజుల పాటు రోజుకు మూడు నాలుగు సార్లు గాయంపై పేస్ట్‌ పెట్టింది.

అయితే టూత్‌ పేస్ట్‌ గాయంపై ప్రభావం చూపింది. కాని అది రివర్స్‌లో చూపింది. గాయంను మాన్చకుండా చేయంతా కూడా వాచిపోయేలా చేసింది..

ఒక రబ్బరు బెలూన్‌ మాదిరిగా చెయ్యి వాచి పోయింది.

చేయి మరీ దారుణంగా వాయడంతో ఇక లాభం లేదనుకుని స్థానిక డాక్టర్‌ వద్దకు వెళ్లాడు. చేయి వాసిన విధానం చూస్తే అసలు చేయి పనికి రాదా, చేయి తీసేయాల్సి ఉంటుందా ఏంటీ అన్నట్లుగా తయారైంది.

అయితే డాక్టర్‌ చేయి తీసే అవసరం లేకుండా ట్రీట్‌మెంట్‌ చేశాడు. చేయి బాగా ఇన్ఫెక్షన్‌ అయ్యిందని, వెంటనే ఆ చేయిని క్లీన్‌ చేసి యాంటి బయోటిక్స్‌ ఇవ్వడంతో పాటు, చేయి కాలిన వద్ద చిన్న ఆపరేషన్‌ కూడా చేశారు. వారం రోజుల నరకం తర్వాత ఆమె చేయి మామూలుగా మారింది.

అందుకే వైధ్యులు ప్రతి దానికి కూడా ఇంట్లో చికిత్స అంటే ప్రాణాలమీదకు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తలు పాటించి ఎంత వరకు అవసరమో అంత వరకు మాత్రమే ఇంట్లో ప్రధమ చికిత్స చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి దానికి ఇంట్లో చికిత్స చేసుకునే ఆలోచన అస్సలు రావద్దని ఈ సందర్బంగా ఆమెకు చికిత్స చేసిన డాక్టర్‌ తెలియజేశాడు. ఆమె చేయిని ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన డాక్టర్‌ మరెవ్వరు కూడా కాలిన గాయాల మీద టూత్‌ పేస్ట్‌ పెట్టుకోవద్దని హెచ్చరించాడు.