ఈటెల రూపంలో కేసీఆర్ కు భంగపాటు తప్పదా?

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు కేసీఆర్ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది.ఈ రాజకీయ క్రీడలో ఎవరు నెగ్గుతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

 Should Kcr Be Disturbed In The Form Of Etela Rajender-TeluguStop.com

కేసీఆర్ కు ఈటెలకు ఎక్కడ చెడిందో ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉన్నా త్వరలో ఆ విషయం బయటపడుతుందని ఎదురుచూస్తున్నారు.అయితే మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ మా భూములు కబ్జా చేసాడని సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో స్పందించిన కేసీఆర్ అత్యవసర విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టి అసైన్డ్ భూములను ఈటెల కబ్జా చేసాడని మెదక్ కలెక్టర్ హరీష్ నివేదిక ఇచ్చారు.ఇక ఆ తరువాత ఈటెల కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది.

 Should Kcr Be Disturbed In The Form Of Etela Rajender-ఈటెల రూపంలో కేసీఆర్ కు భంగపాటు తప్పదా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈటెలకు మద్దతుగా ముదిరాజులు, అదే విధంగా ఉద్యమకారులు అందరు ఒక్కటైన పరిస్థితి ఉంది.ఇక త్వరలో ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే ఇప్పుడు ఉద్యమకారులు, ముదిరాజులు సైతం ఈటెల వైపు ఉండడంతో కేసీఆర్, ఈటెల మధ్య పరోక్ష పోరాటం కొనసాగుతోంది.మరి ఈటెల కేసీఆర్ పై వేసిన వ్యూహాలు ఫలిస్తే కేసీఆర్ కు భంగపాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#Kcr Disturbed #@trspartyonline #@CM_KCR #Trs Party #Etela Rajender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు