జనసేన కోసం చంద్రబాబు త్యాగం చేయాల్సిందేనా ? 

2024 ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ(TDP) చాలా ఆశలు పెట్టుకుంది.ఒంటరిగా పోటీ చేసి ఎన్నికలకు వెళ్తే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి అనే విషయం ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బాగా తెలుసు.

 Should Chandrababu Naidu  Sacrifice For Janasena Janasena, Pavan Kalyan, Janase-TeluguStop.com

అందుకే జనసేన,  బిజెపిలతో పాటు వామపక్ష పార్టీలను కలుపుకు వెళ్లి వైసిపిని ఎదుర్కోవాలని, ఆ తరువాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే వ్యూహంలో చంద్రబాబు ఉన్నారు.విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తేనే వైసీపీని ఓడించడం సాధ్యమవుతుందనే విషయాన్ని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు.

అందుకే జనసేనతో తరచుగా టచ్ లోకి వెళ్తూ, ఆ పార్టీతో పొత్తు కు సిద్ధమయ్యారు.అలాగే ఎన్నికల సమయం నాటికి బీజేపీని ఒప్పించి తన కల నెరవేర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.అయితే ఇప్పుడు జనసేన వైఖరిలో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది.20, 30 సీట్లు జనసేనకు కేటాయించి ఏపీలో అధికారంలోకి వద్దామని చంద్రబాబు భావిస్తున్న,  జనసేన మాత్రం ఆ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదనే విషయం నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం ద్వారా అర్థమైంది.

Telugu Ap Cm, Ap, Mp Jogayya, Jagan, Janasena, Janasenani, Kapusankshema, Pavan

 జనసేన(Janasena) కనీసం సగం సీట్లలోనైనా పోటీ చేయాలని , అలాగే రెండున్నర సంవత్సరాలైనా ముఖ్యమంత్రి పదవి  కేటాయించాలనే డిమాండ్ జనసేన వర్గాలతో పాటు,  కాపు సంక్షేమ శాఖ సేన నుంచి వినిపించింది.దీనికి తగ్గట్లుగానే పవన్ కూడా ప్రసంగించారు.అవసరమైతే ఒంటరిగానైనా పోటీ చేస్తాము తప్ప , ఎన్నో కొన్ని సీట్లతో సరిపెట్టుకోలేము అంటూ వ్యాఖ్యానించారు.ఇక కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరి రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

టిడిపి కి జనసేన భేషరతుగా మద్దతు ఇస్తుంది అంటూ టిడిపి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని,  జనసేనకు 20 సీట్లు మాత్రమే ఇస్తున్నారు అని,  దీనికి పవన్ కూడా అంగీకరించారనే  ప్రచారం చేసుకుంటున్నారని , చంద్రబాబు ను సీఎం చేసేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారని టిడిపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయని,  నిన్న జరిగిన సమావేశంలో జోగయ్య(Jogayya) అన్నారు.జనసేనలో చేరాల్సిన నాయకులను టిడిపి చేర్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ను ఓడించాలంటే పవన్ ను సీఎం చేయాలనే నినాదాన్ని వినిపించారు.

Telugu Ap Cm, Ap, Mp Jogayya, Jagan, Janasena, Janasenani, Kapusankshema, Pavan

అంతేకాదు జగన్ ను అధికారానికి దూరం చేయాలంటే చంద్రబాబు(Chandrababu naidu ) దగ్గర తప్పదని పవన్ ను సీఎం చేస్తానని చెప్తేనే జగన్ ను ఓడించడం ఈ పరిణామాలు ఇప్పుడు టిడిపిలోని చర్చ జరుగుతోంది.టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు అంతంత మాత్రంగానే  ఉంటాయని కాబట్టి జన సేన తో పొత్తు పెట్టుకోవాల్సిందే అని, లేకపోతే మరోసారి జగన్కు అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉండాల్సిందేనని సూచనలు చంద్రబాబుకు అందుతున్నాయి ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు కాస్త వెనక్కి తగ్గి జనసేనకు గౌరవప్రదమైన స్థానాలను కేటాయించడంతోపాటు సీఎం సీటు విషయంలోనూ త్యాగానికి సిద్ధమైతేనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube