'ఆదిపురుష్' చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అన్ని కోట్లు వసూలు చెయ్యాలా? ఇది అసలు సాధ్యమేనా!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు లేక, డబ్బులు రొటేట్ అవ్వక థియేటర్స్ మొత్తం వెలవెలబోతోంది.ఈ ఏడాది సమ్మర్ కానుకగా విడుదలైన మీడియం రేంజ్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ కి మాములు దెబ్బ కొట్టలేదు.

 Should 'adipurush' Film Break Even And Collect All The Crores? Is This Actually-TeluguStop.com

ఒక్కో హీరో కనీసం 20 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిల్చారు.కేవలం సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మరియు న్యాచురల్ స్టార్ నాని ‘దసరా‘ చిత్రాలు మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి.

మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.పాపం బయ్యర్స్ కి పది రూపాయిలు వస్తే వంద రూపాయిలు పోయింది.

ఇలాంటి దరిద్రమైన సమ్మర్ సీజన్ ని టాలీవుడ్ ఇది వరకు ఎప్పుడూ కూడా చూడలేదు.ఇప్పుడు ట్రేడ్ మొత్తం లాభాలు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న సినిమా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన ‘ఆదిపురుష్( Adipurush )’ చిత్రం.

Telugu Adipurush, Bollywood, Break, Kriti Sanon, Om Raut, Prabhas, Radhe Shyam,

సుమారుగా 450 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16 వ తారీఖున అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతుంది.ఈ సినిమాతో థియేటర్స్ మొత్తం కళకళలాడుతూ టాలీవుడ్ కి పూర్వ వైభవం రప్పిస్తుందని బలమైన నమ్మకం తో ఉంది ట్రేడ్.ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికా లో ప్రారంభం అయ్యింది, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే యావరేజి అడ్వాన్స్ బుకింగ్స్ అని అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ఇక పోతే ఈ చిత్రానికి సంబంధించిన అన్నీ ప్రాంతాల ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి అయ్యినట్టు తెలుస్తుంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణకు కలిపి 125 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట.నైజాం ప్రాంతం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కొనుగోలు చేసింది.

Telugu Adipurush, Bollywood, Break, Kriti Sanon, Om Raut, Prabhas, Radhe Shyam,

ఓవర్సీస్, కర్ణాటక వంటి ప్రాంతాలను కూడా కలిపితే కేవలం తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 160 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు రావాలి అట.అయితే ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి, అంత వసూళ్లు రావడం సాధ్యమేనా అని అనిపిస్తుంది.ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా ‘రాధే శ్యామ్( Radhe Shyam )’ రేంజ్ ప్రీమియర్స్ గ్రాస్ ని కూడా రాబట్టేలాగా లేదు.హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ కి ఒక్క టికెట్ కూడా కదలడం లేదు.

ఒక రేంజ్ లో అద్భుతమైన టాక్ వస్తే కానీ, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇక్కడ నష్టపొయ్యేది మొత్తం నార్త్ ఇండియా లో కవర్ చేస్తుందనే నమ్మకం తో ఉన్నారు నిర్మాతలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube