ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీ కొట్టనుందా..??

ఖగోళ శాస్త్రం అంటేనే ఒక వింత శాస్త్రం.ఎందుకంటే ఖగోళ శాస్త్రంలో ఎవరికీ అంతు చిక్కని అనేక ప్రశ్నలు ఉంటాయి.

 Should A Huge Asteroid Hit The Earth , Earth, Sciences, Latest News, Viral Lates-TeluguStop.com

ఇందులో ఉండే గ్రహాలు, ఉపగ్రహాలు నక్షత్రాలు, పాలపుంత అని అనేక రకాలు అయిన ఆసక్తికర అంశాలు చాలానే ఉంటాయి.ఒక్కసారి అయిన అంతరిక్ష యానం చేసి వాటిని చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా.అయితే ఎంత మంది ఎన్ని విధాలుగా పరిశోధనలు చేసిన గాని ఈ అనంత విశ్వం పుట్టుకపై ఎవ్వరికి స్పష్టత లేదు.ఇంకా మన ఖగోళ శాస్త్రవేత్తలు వీటి గురించి పరోశోదనలు చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలో ఒక గ్రహ శకలం తిరుగుతుండడాన్ని మన శాస్త్రవేత్తలు గుర్తించారు.నిజానికి ఈ గ్రహ శకలాన్ని 2016 లోనే హవాయిలో ఉండే టెలిస్కోప్ సాయంతో గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

కానీ ఈ గ్రహ శకలానికి సంబంధించిన పూర్తి సమాచారం శాస్త్రవేత్తలకు అప్పట్లో అంతు చిక్కలేదు.

తాజా సమాచారం ప్రకారం చంద్రుడిని ఓ ఉల్క ఢీ కొట్టడంతో అందులోని కొంత భాగం విరిగి భూకక్ష్యలో తిరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

దాని పేరు కామో ఓవాలేవా.కాగా శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇది గ్రహశకలంలాగా లేదు అని, ఇది చంద్రుని ఉపరితలం నుంచి ఊడిపడి ఉంటుందని భావిస్తున్నారు.

మరి కామో గురించి పూర్తి వివరాలు తెలియాలంటే దానిపై నుంచి శాంపిళ్లను సేకరించాల్సి ఉంటుందని, ఆ ప్రాసెస్ కు కొంత సమయం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.దీని ఆకారం చూస్తే సుమారు నలభై మీటర్లు ఉంటుందని పరిశోధకులు వివరించారు.

అయితే దీన్ని చంద్రుడు నుంచి విరిగిపడడం వలన దీనిని పాక్షిక ఉపగ్రహంగా దీనిని పేర్కొనవచ్చని స్పష్టం చేశారు.కాగా ఇప్పటికే ఇలాంటి గ్రహ శకలాలు చాలానే ఉన్నాయని, భూమి నుంచి చాలా దగ్గరగా సుమారు ఎనిమిది గ్రహశకలాలు ఇప్పటికే సంచరిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

అయితే lప్రస్తుతానికి దీనిని ఒక ప్రత్యేకమైన శిలగా పరిగణిస్తున్న శాస్త్రవేత్తలు ఇందులో ఖనిజాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఎందుకంటే ఈ శిల చూడడానికి పెద్ద ఆకారంలో ఉండడంతో పాటు, ఎరుపు రంగుతో ప్రకాశిస్తోంది.

అందుకనే ఈ శిలలో ఎక్కువగా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.ఈ శిల గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే సాంపిల్స్ ను పరిక్షిస్తే తప్పా తెలియదు అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube