జగన్ ప్రచార సభలో అపశృతి....ఒకరు మృతి!  

Short Circuit Near Jagan Campaigning-crowd,dead,generator,guntur,jagan,political Updates,short Circuit,ycp

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు జిల్లా లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైకాపా అధినేత జగన్‌ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు..

జగన్ ప్రచార సభలో అపశృతి....ఒకరు మృతి!-Short Circuit Near Jagan Campaigning

ఈ సందర్భంగా జగన్ సభ కోసం చాలా మంది ప్రజలు అక్కడకి చేరుకున్నారు. ఈ క్రమంలో జగన్ సభ లో ప్రసంగించిన అనంతరం జనరేటర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం తో పది మంది గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో ఆర్టీసీ కండక్టర్ సోమి రెడ్డి(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. అలానే ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.

క్షతగాత్రుల్లో మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ బాలుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన క్షతగాత్రులకు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు.

జగన్ సభలో ఈ విధంగా అపశృతి చోటుచేసుకోవడం ఇదే తొలిసారి ఏమీ కాదు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా లో నిర్వహించిన సభలో కూడా గోడ కూలి ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.