కిలో మటన్ రూ.480.. ఎక్కడో తెలుసా?

దేశవ్యాప్తంగా మాంసాహారం తినే వారి సంఖ్య పెరిగిపోవడంతో మటన్ ధర ఆకాశాన్ని అంటుతున్నాయి.ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో మటన్ కిలో ధర రూ.600 నుండి రూ.700 పలుకుతోంది.అయితే దీంతో సామాన్య ప్రజలు మటన్ జోలికి వెళ్లకుండా చేపలు, చికెన్‌తో సరిపెట్టుకుంటున్నారు.కానీ మహారాష్ట్రలోని కొల్హాపూర్ వాసులు మాత్రం మటన్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు.

 Shopkeepers Agree To Sell Mutton Kg At Rs 480-TeluguStop.com

వారికి మటన్ కిలో రూ.480కే దొరుకుతుండటమే దీనికి కరాణం.దేశమంతా ఒకరేటు ఉంటే కొల్హాపూర్‌లో ఎందుకు తక్కువగా ఉండొచ్చు అనే సందేహం మీకు రావచ్చు.అయితే అక్కడ చనిపోయిన గొర్రెలు, మేకల మటన్ అమ్ముతున్నారేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.

అక్కడి మాంసం వ్యాపారులు మేకలు, గొర్రెలను కస్టమర్ల ముందే కోసి తాజా మటన్ వారికి అమ్ముతున్నారు.మరి ఇంత తక్కువ రేటుకు అమ్మడానికి వెనక ఓ కారణం కూడా ఉంది.

మాంసం రేటుకు ఎక్కువగా ఉండటంతో మాంసం కొనే వారు లేక కొందరు వ్యక్తులు తమ వద్ద ఉన్న మేకలు, గొర్రెలను కోసి మటన్ కిలో రూ.400కే అమ్మడం ప్రారంభించారు.ఇలా వారం రోజుల పాటు అమ్మకాలు చేయడంతో మిగతా వ్యాపారులు తమ పొట్ట కొట్టదంటూ వారితో చర్చలు జరిపి కిలో మటన్ రూ.480కే అమ్మేందుకు ఒప్పుకున్నారు.దీంతో కొల్హాపూర్ గ్రామస్తులు ప్రస్తుతం మటన్ ధరను మిగతా ప్రాంతాలకంటే తక్కువ ధరకే పొందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube