నల్లజాతీయుడిపై పేలిన తూటా.. భగ్గుమన్న అమెరికా..!!

అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా మరో సారి నల్లజాతీయులు నిరసనలు తెలిపారు.అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రభుత్వానికి, పోలీసులకి వ్యతిరేకంగా ఈ సంఘటన జరగడంతో రిపబ్లికన్ పార్టీలో అలజడి నెలకొంది.

 Attack On Black Man Jacob Blake, Jacob Blake Shooting, America, Shooting On Blac-TeluguStop.com

ఎన్నో ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్న నల్లజాతీయులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి.ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం రాజకీయ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఘటన వివరాలోకి వెళ్తే.

విస్కాన్సిస్ లోని జాకబ్ బ్లేక్ అనే నల్లజాతీయుడిపై అతడి పిల్లలు చూస్తుండగానే పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ సంఘటన అందరిని ఎంతగానో కదిలించింది.కొద్ది రోజుల క్రితమే జార్జ్ ఫ్లాయిడ్, మరోక నల్ల జాతీయుడు బ్రూనే లపై జరిగిన హత్య ఘటనలు అమెరికాలో అతిపెద్ద అల్లర్లకి దారి తీసింది.

అంతేకాదు ఈ ప్రభావంతోనే నల్లజాతీయుల ఓట్లు రిపబ్లికన్ పార్టీకి మళ్ళకుండా రాజకీయాలు కూడా జరిగాయి.ఈ క్రమంలోనే తాజాగా జాకబ్ బ్లేక్ పై కాల్పులు జరగడం మరో సంచలనం సృష్టించింది.

ఈ ఘటనను నిరసిస్తూ నల్లజాతీయులు బ్లేక్ కి మద్దతుగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

Telugu America, Attackblack, Jacob Blake, Racisim, Black-

బ్లేక్ పై దాడి చేసిన పోలీసు అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేపట్టారు.ఈ క్రమంలోనే కొందరు నిరసన కారులు, మున్సిపల్ పబ్లిక్ సేఫ్టీ భవనంలోకి దూసుకువెళ్ళే ప్రయత్నం చేశారు.

దాంతో కర్ఫ్యూ ప్రాంతంలోకి వచ్చారని నిరసన కారులపై పోలీసులు బాష్పవాయువుని ప్రయోగించారు.ఈ క్రమంలోనే ఆందోళనలు మరింత ఉదృతం అవ్వడంతో ఆ ప్రాంత గవర్నర్ టోనీ ఎవర్స్ స్పందిచారు.

పోలీసులు నల్లజాతీయుడిపై కాల్పులు జరగపడం అన్యాయమని, వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని అన్నారు.అంతేకాదు పోలీసు విధానాలపై సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నట్టుగా తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube