ఇటీవల ఇటలీ రాజధాని అయిన రోమ్ లో కాల్పులు జరిగాయి.అయితే రోమ్ లోనీ ఓకే ఫ్లోలో ఒక దుండగుడు కాల్పులు జరిపాడు.
అందులో ఆ దేశ ప్రధాని స్నేహితురాలు సహ మరో ముగ్గురు మృతి చెందారు.అలాగే మరో నలుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
అయితే ఆదివారం రోజున ఫ్రీడమ్ జిల్లాలోని ఒక కేఫ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే కొందరు కమిటీ సభ్యులు తమ అపార్ట్మెంట్ కమిటీ రెసిడెన్స్ కమిటీ సమావేశాన్ని ఎలా నిర్వహించాలని అలాంటి అంశాలపై చర్చించాలని ఆ కేఫ్ లో సమావేశం అయ్యారు.
అయితే అదే సమయంలో ఓ వ్యక్తి కేఫ్లోకి దూరి అందర్నీ చంపేస్తానంటూ అరుస్తూ అందరిపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.దీంతో ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు చనిపోగా మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
అయితే అక్కడ ఉన్న స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ ఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోడీ స్పందిస్తూ కాల్పులలో చనిపోయిన వారిలో తన స్నేహితురాలు కూడా ఉందని ఆమె పేరు నికోలేక గొలిసాను అని పేర్కొంది.
అలాగే ఆమెతో కలిసి ప్రధాని దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి ఉద్వేగ భరితమైన పోస్ట్ పెట్టింది.
తన స్నేహితురాలు ఒక ప్రొటెక్టివ్ మదర్ అని, మంచి ఫ్రెండ్ అని, శక్తివంతమైన మహిళ అని తెలిపింది.అలాంటి ఆమెకు ఇలాంటి చావు ఆమె ఇలాంటి చావుకి అర్హురాలు కాదని ఆమె పేర్కొంది.
అయితే కొన్ని వారాల క్రితమే ఆమె తన పుట్టినరోజును జరుపుకుందని తెలిపింది.

అలాగే అలాంటి స్నేహితురాలు ని కోల్పోవడం తనకు ఎంతో బాధాకరంగా ఉందని ఆమె తెలిపింది.ఇక రోమ్ మేయర్ రాబట్టు ఈ ఘటనని గ్రేప్ ఎపిసోడ్ ఆఫ్ పేర్కొంటూ సోమవారం దీనికి సంబంధించి ఎమర్జెన్సీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు.ఇక కాల్పులు జరిపిన వ్యక్తి విషయానికొస్తే గతంలో ఇతనికి కమిటీ సభ్యులతో విభేదాలు ఉండడం వల్లనే ఇలాంటి ఘటనకు దిగాడని పోలీసులు గుర్తించారు.