తోటి విద్యార్ధులపై మరో విద్యార్ధి కాల్పులు: ఇద్దరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు  

Shooting At California Saugus High School-saugus High School,shooting At California,students Dead,telugu Nri News Updates

కాలిఫోర్నియాలోని సౌగస్ హైస్కూల్‌లో ఓ విద్యార్ధి తోటి విద్యార్ధులపై కాల్పులు జరిపి అనంతరం తనను తాను కాల్చుకున్నాడు.ఈ ఘటనలో ఓ బాలిక, ఓ బాలుడు అక్కడిక్కడే మరణించగా.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న లాస్ ఏజెంల్స్ కౌంటీ షెరీఫ్ పోలీసులు అక్కడకి చేరుకుని 16 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని.క్షతగాత్రులను హెన్రీ మాయో హాస్పిటల్‌కి తరలించారు.

Shooting At California Saugus High School-saugus High School,shooting At California,students Dead,telugu Nri News Updates Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాం-Shooting At California Saugus High School-Saugus School Shooting Students Dead Telugu Nri News Updates

సదరు విద్యార్ధి ఆసియా-అమెరికన్ జాతికి చెందిన వాడని, గురువారం అతని 16వ పుట్టినరోజని లాస్ ఏంజెల్స్ కౌంటీ షెరీఫ్ కెప్టెన్ కెంట్ వెజ్‌నర్ మీడియాకు వెల్లడించారు.గురువారం రాత్రి ఏడు గంటల నాటికి క్షతగాత్రుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా.మరోకరి పరిస్థితి విషమంగా ఉంది.కాగా ఘటనాస్థలం నుంచి 45 ఎం ఎం సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితుడైన 16 ఏళ్ల బాలుడి తల్లి, ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ట్రంప్ తన సానుభూతిని తెలియజేశారు.

అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.