ఏలియన్స్ పై కాల్పులు.. చివరికి...?

ఏలియన్స్‌ గురించి మన అందరికీ తెలిసిందే.చాలా సినిమాల్లో ఏలియన్స్ ఎలా ఉంటాయో మనం చూసాము.

 Shooting At Aliens . In The End . Aliens, Firing, Hotel, Viral Latest, News Vira-TeluguStop.com

సినిమాల వరకు ఒకేగాని అసలు నిజంగానే ఏలియన్స్ అనేవి ఉన్నాయా? లేదా అనే విషయంపై ఇప్పటికి మన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.గ్రహాంతరవాసులుగా పిలిచే ఈ ఏలియన్స్ కొంతమంది చూసారు అని కథనాలు కూడా వచ్చాయి కానీ వేటికి కూడా సరైన సాక్షాలు లేవు.

కొంతమంది అయితే మేము ఏలియన్స్ ను చూసామని అవి మానవులపై దాడి చేసేందుకే భూ గ్రహం మీదకి వచ్చాయని కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది.

ఇప్పుడు ఇదే మాదిరిగా ఒక వ్యక్తి కూడా తాను ఏలియన్స్ ను చూశానని వాటిపై తుపాకీ పెట్టి కాల్పులు చేసానని చెబుతూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

వీడియోను విడుదల చేసిన గంటల సమయంలోనే సోషల్ మీడియాను షేక్ చేసేసింది.అసలు అతను చెప్పింది నిజామా లేక సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం ఇలా కట్టుకథ అల్లుతున్నాడా అనే వివరాలు ఒకసారి చూద్దాం.

అమెరికాలోని కెంటుకీ హోటల్‌లోని ఒక రూమ్ లో ఉంటున్న శామ్యూల్‌ రిడెల్‌ అనే వ్యక్తి ఈ వీడియోను తీసి పోస్ట్ చేసి తనకు ఏలియన్స్‌ కనిపించాయని అంటున్నాడు.శామ్యూల్ ఉంటున్న గది కిటికీ దగ్గర ఉన్న పార్కింగ్‌ వైపుకు చూడగా అతనికి ఏలియన్స్‌ కనిపించాయని చెప్పాడు.

అవి సరిగ్గా శామ్యూల్ ఉంటున్న గది వైపు రావడం చూసి భయపడ్డ శామ్యూల్ తన దగ్గర ఉన్న తుపాకీ తీసి ఏలియన్స్ ను కాల్చానని తెలిపాడు.

Telugu Aliens, Hotel, Latest-Latest News - Telugu

అలా తుపాకీతో ఎప్పుడయితే నేను ఫైరింగ్ చేయడం మొదలుపెట్టానో అప్పుడు అవి పారిపోయాయని చెప్పుకొచ్చాడు.అయితే హోటల్ లో కాల్పుల శబ్దం వినిపించగానే హోటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యి అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే హోటల్ కి చేరుకొని విచారణ చేపట్టారు.శామ్యూల్ తుపాకీతో కాల్చిన సమయంలో ఒక బుల్లెట్ హోటల్ లోని పక్కగదిలోకి వెళ్లగా మరికొన్ని బులెట్లు మాత్రం కింద పార్కింగ్ ప్లేస్ లో పడి ఉండడంతో పోలీసులు శామ్యూల్ ని అదుపులోకి తీసుకోని విచారించగా అతను చెప్పిన కథ విని పోలీసులు విస్తుపోయారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.అతను చెప్పిన విషయంలో నిజం ఎంత ఉన్నది అనే మాట పక్కనే పెడితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube