టీవీ ఛానల్ లో ప్రసారమైన వకీల్ సాబ్.. షాక్ లో ఫ్యాన్స్..?

గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన వకీల్ సాబ్ సినిమా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నా రికార్డు స్థాయిలో షేర్ కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.ఈ వీకెండ్ నాటికి వకీల్ సాబ్ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Shockingly Pawans Vakeel Saab Telecasted In Tv On Its Release Date, Local Cabl-TeluguStop.com

అయితే వకీల్ సాబ్ సినిమాకు పైరసీ రూపంలో భారీ షాక్ తగిలింది.పవన్ కళ్యాణ్ హీరోగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటించారు.ఈ సినిమా నిర్మాత దిల్ రాజు రిలీజ్ రోజు నుంచి వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన పైరసీ లింక్స్ కు సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరారు.

అయితే ఈ సినిమా రిలీజ్ రోజే విజయనగరం జిల్లాలోని లోకల్ టీవీ కేబుల్ ఛానల్ లో ప్రసారమైందని సమాచారం.ఈ విషయం తెలిసి అభిమానులు అవాక్కవుతున్నారు.వకీల్ సాబ్ సినిమాను ప్రసారం చేసిన లోకల్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Telugu Cable Channel, Tv, Vakeel Saab, Vijayanagara-Movie

వకీల్ సాబ్ సినిమాకు పైరసీ వల్ల కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పవచ్చు.సినిమాను ప్రసారం చేసిన ఛానెల్ పై నిర్మాత దిల్ రాజు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.మరోవైపు వకీల్ సాబ్ సినిమాకు కొన్ని వారాల పాటు పోటీ లేదని చెప్పవచ్చు.

ఇప్పటికే రిలీజ్ డేట్లను ప్రకటించిన పలు సినిమాలు వాయిదా పడగా మరికొన్ని సినిమాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

సాధారణ పరిస్థితులు ఉంటే వకీల్ సాబ్ కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసి ఉండేదని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube