ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీపై షాకింగ్ అప్డేట్.. ఫ్యాన్స్ ఆశ్చర్యపోయేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకావడానికి మరో ఏడాది సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 Shocking Update About Ntr Prashant Neel Movie Details Here Ntr , Prashant Neel , Tollywood, Koratala Shiva , Rrr ,-TeluguStop.com

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా పారితోషికాల కోసమే 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల మేర ఖర్చయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

 Shocking Update About Ntr Prashant Neel Movie Details Here Ntr , Prashant Neel , Tollywood, Koratala Shiva , Rrr , -ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీపై షాకింగ్ అప్డేట్.. ఫ్యాన్స్ ఆశ్చర్యపోయేలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రశాంత్ నీల్ సినిమాలకు 500 కోట్ల రూపాయల స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం శాటిలైట్, డిజిటల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉండటంతో నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

అయితే తారక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించనున్నారంటూ ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్డేట్ ప్రచారంలోకి వస్తోంది.అధికారికంగా క్లారిటీ లేకపోయినా వైరల్ అవుతున్న ఈ వార్త తారక్ అభిమానులకు ఎంతగానో నచ్చేసింది.వరుసగా ఆరు హిట్లను ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకుని ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఎన్టీఆర్ ను ఊరమాస్ గా ప్రశాంత్ నీల్ చూపించనున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ సైతం ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఎన్టీఆర్ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి.

ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube